🔴 Telangana Budget LIVE: తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకు భారీగా నిధులు!

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 2,92,159 కోట్లు అని భట్టి వెల్లడించారు. అత్యధికంగా వ్యవసాయానికి రూ.72,659 కోట్లను కేటాయించారు. పంచాయతీ రాజ్ కు రూ.29,816 కోట్లు వెచ్చించారు.

🔴 Telangana Budget LIVE: తెలంగాణ బడ్జెట్.. ఆ శాఖలకు భారీగా నిధులు!
New Update

Telangana Budget 2024: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. అప్పు పది రెట్లు పెరిగిందన్నారు. పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
భట్టి బడ్జెట్ స్పీచ్ హైలెట్స్..
- 2,92,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్
- గృహజ్యోతికి రూ.2,418 కోట్లు
- సాగు నీటి రంగానికి రూ.26 వేల కోట్లు
- వ్యవసాయానికి రూ.72,659 కోట్లు
- హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు
- పంచాయతీ రాజ్‌ కు రూ.29,816 కోట్లు
-విద్యాశాఖకు రూ.21 వేల కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.3003 కోట్లు
-  బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు
- ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు
-  పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు
-  విద్యుత్ రంగానికి రూ.16410 కోట్లు
- రోడ్లు భవనాలకు రూ.5790 కోట్లు
-అడవులు పర్యావరణానికి రూ.1064 కోట్లు
- హార్టికల్చర్-రూ.737
- పశుసంవర్ధక శాఖ-రూ.19080
- రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు
- ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు
- ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు
-500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు

ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం లైవ్ ను ఈ వీడియోలో చూడండి..

#congress #bhatti-vikramarka #telangana-budget-2024
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe