TGPSC Group-1: 'గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలి'

గ్రూప్-1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని, గ్రూప్-2, 3 పోస్టులను పెంచాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ రోజు టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన నిర్వహించారు. అయితే.. వీరి ఆందోళనను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

TGPSC Group-1: 'గ్రూప్-1కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలి.. గ్రూప్-2, 3 పోస్టులు పెంచాలి'
New Update

TGPSC : గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prelims) లో 1:100 ప్రకారం మెయిన్స్ కు అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేవైఎం (BJYM) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీజీపీఎస్పీ వద్ద భారీ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. 25 వేల టీచర్ పోస్టుల భర్తీకోసం మెగా డీఎస్సీ (Mega DSC) ని నిర్వహించాలన్నారు. ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలండర్ (Job Calendar) విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలన్నారు.

తమ డిమాండ్లను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళనలను తీవ్ర తరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బీజేవైఎం నేతలు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ల మహేందర్, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Also Read : అయ్యన్నకు ఇక ఆ అవకాశం ఉండదు.. నవ్వులు పూయించిన లోకేష్

#tgpsc-group-1 #group-1-prelims #mega-dsc #telangana-job-calendar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe