Telangana Elections: కోచింగ్ బంద్ చేసి ఊర్లకు వెళ్లండి.. బీజేపీకి ఓటు వేయించండి.. యువతకు బండి సంజయ్ పిలుపు.

అశోక్‌నగర్‌లో యువతి ప్రవళిక ఆత్మహత్య అంశంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరికొత్త నినాదాన్ని క్రియేట్ చేశారు. మరి ఆ నినాదం ఏంటో తెలియాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే.

New Update
Telangana Elections: కోచింగ్ బంద్ చేసి ఊర్లకు వెళ్లండి.. బీజేపీకి ఓటు వేయించండి.. యువతకు బండి సంజయ్ పిలుపు.

Bandi Sanjay Kumar: అశోక్‌నగర్‌లో యువతి ప్రవళిక ఆత్మహత్య అంశంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరికొత్త నినాదాన్ని క్రియేట్ చేశారు. మరి ఆ నినాదం ఏంటో తెలియాలంటే.. ఈ వార్త పూర్తిగా చదవాల్సిందే. శనివారం నాడు బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దసస్సు అనంతరం మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. ఈ సందర్భంగా అశోక్ నగర్‌లో యువతి ఆత్మహత్యపై స్పందించారు. రాష్ట్రంలో విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ముఖ్యమంత్రి స్పందించరని ఫైర్ అయ్యారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం దారుణం అన్నారు. ప్రవళిక తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. 'పరీక్షలు వాయిదా పడుతున్నాయి. మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారు.' అని వాళ్ళ అమ్మ నాన్నతో ఫోన్‌లో బాధపడిందని చెప్పారు బండి సంజయ్.

ఆమె మృతికి నిరసనగా అశోక్ నగర్‌లో రోడ్డపై యువత మొత్తం వచ్చారని, దీనిపై వాస్తవాలు తెలుసుకుందామని లక్ష్మణ్, భానుప్రకాష్ వెళ్లారన్నారు సంజయ్. అయితే, వీరందరి రాక ప్రభుత్వానికి నచ్చక పోలీసులతో లాఠీ చార్జీ చేశారన్నారు. లక్ష్మణ్‌ను ఎంపీ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని.. ఈసారి గనుక అవకాశం ఇస్తే రాష్ట్ర ప్రజల సంగతి అంతేనని అన్నారు.

ఇదికూడా చదవండిRenu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడి తెరంగేట్రంపై రేణు దేశాయ్ ఎమన్నారంటే..?

బిడ్డ మృతితో బాధలో ఉన్న కుటుంబానికి మనోధైర్యం కల్పించకుండా.. లవ్ ఫెయిల్యూర్ అని చెబుతున్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ఆ కుటుంబం ఎంతగా కుమిలిపోతుందో తెలుసా? అని ప్రశ్నించారు. యువతి లవ్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయిందంటూ.. అబద్ధపు లేఖలు సృష్టించేందుకు కూడా కేసీఆర్ వెనుకాడరని విమర్శించారు.

ఇదే సమయంలో నిరుద్యోగులకు అండగా తాము ఉంటామని భరోసా ఇచ్చారు బండి సంజయ్. 'నిరుద్యోగులకు అండగా మేముంటాం. మీరు కోచింగ్ సెంటర్లు మొత్తం బంద్ చేసి మీ గ్రామాలకు వెళ్ళండి. నిరుద్యోగులు 50 లక్షల మంది ఉన్నారు. వారంతా గ్రామాలకు వెళ్లి 50 రోజులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించి బీజేపీకే ఓటు వేసేలా చూడండి. మీకు నేను నియామక పత్రాలు అందజేస్తా. ఉద్యోగులు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వం కూల్చడం పెద్ద మ్యాటర్ కాదు. ఉద్యోగులకు జీతాలు కూడా అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మీకు చేతులు జోడించి అడుగుతున్నా.. మీ కోసం జైలుకు వెళ్లిన అన్నగా అడుగుతున్నా.. 50 రోజులు కొట్లాడండి.. బీజేపీకి అండగా నిలవండి. నవంబర్ 30 కేసీఆర్ కు డెడ్ లైన్ కావాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలి. కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబెడ్కర్ రాజ్యాంగం కావాలా. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే. కర్ణాటకలో రూ. 40 కోట్లు దొరికాయి. తెలంగాణ ఎన్నికల కోసం వాటిని తరలించాలనుకున్నారు. బోరబండలో బీఆర్‌ఎస్ పార్టీ నేత ఇంట్లో డ్రగ్స్ దొరికాయి. ఎన్నికల కోసమే విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అందిస్తున్నారు. 3+3=6.. బిఆరెస్ ఇంటికి పోవడం ఫిక్స్. కారు షెడ్డుకు పోయింది.. సారు ఫామ్ హౌజ్ కు.. 16 ఎక్కడ పోయిందో వారికే తెలియాలి.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇదికూడా చదవండిభారత్-పాక్ మ్యాచ్ క్రేజ్…ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్

Advertisment
తాజా కథనాలు