బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదలైంది. 14 మంది అభ్యర్థులతో పార్టీ చివరి జాబితాను విడుదల చేసింది. అయితే మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. బెల్లంపల్లి, వనపర్తి, చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్చింది. బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి స్థానంలో కొయ్యల హేమాజీ, వనపర్తి లో అశ్వత్థామ రెడ్డి స్థానంలో అనుగ్న రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇక చంద్రయాన గుట్టలో కే.మహేందరన్‌ను ఖరారు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఎన్నికల్లో బీజేపీ 111 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనుంది. అయితే పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 8 స్థానాలు కేటాయించింది. ఇక ఈ ఎన్నికలకు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి దూరంగా ఉన్నారు.
అభ్యర్థులు వీళ్లే
1. బెల్లంపల్లి - కోయల ఎమాజీ
2. పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్
3. సంగారెడ్డి - దేశ్‌పాండే రాజేశ్వర్‌రావు
4. మేడ్చల్ - ఏనుగు సుదర్శన్ రెడ్డి
5. మల్కాజ్‌గిరి - ఎన్. రామచందర్‌రావు
6. శేరిలింగంపల్లి - రవికుమార్ యాదవ్
7. నాంపల్లి - రాహుల్ చంద్ర
8. చంద్రయానగుట్ట - కే.మహేందర్
9. సికింద్రాబాద్ కంటోన్‌మెంట్ - గణేష్ నారాయణ్
10. దేవరకద్ర - కొండా ప్రశాంత్ రెడ్డి
11. వనపర్తి - అనుగ్న రెడ్డి
12. అలాంపూర్ - మీరమ్మ
13. నర్సంపేట్ - పుల్లా రావు
14. మధిర - పెరుమార్పల్లి విజయ రాజు