RTV Uncensored : రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్‌.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్‌ పేరిట వసూళ్లు సాగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆర్టీవీ అన్ సెన్సార్డ్ ఇంటర్వ్యూకు హాజరై రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అనేక విషయాలపై మాట్లాడారు.

New Update
RTV Uncensored : రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్, 'బీ' ట్యాక్స్‌.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు

BJLP Leader : రేవంత్ రెడ్డి(Revanth Reddy) సర్కార్ ను కూల్చాల్సిన అవసరం తమకు లేదని అన్నారు బీజేపీ(BJP) నిర్మల్ ఎమ్మెల్యే, ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి(Maheshwar Reddy) . బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి అబద్ధపు ఆరోపణలు చేశారని అన్నారు. ఇంతకు ఆయన తమ్ముడు ఆయనతో టచ్ లో ఉన్నాడో? లేడో? చెప్పాలన్నారు. వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వస్తే చెప్పులతో కొట్టాలని గతంలో పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డి.. నేడు అదే ఫిరాయింపురాజకీయాలు చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. ఎవరైనా ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తే రాజీనామా చేయించి తీసుకున్నామన్నారు.
ఇది కూడా చూడండి: Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఖమ్మం, కరీంనగర్ ఎంపీ అభ్యర్థులు వీరే?

రాష్ట్రంలో 'ఆర్' ట్యాక్స్(R Tax), 'బీ' ట్యాక్స్‌(B Tax) వసులూ సాగుతోందని రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వర్గాలు లేవన్నారు. తనకు బీజేఎల్పీ నేత పదవిని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పించారనడంలో వాస్తవం లేదన్నారు. మెరిట్ ప్రకారమే తనకు ఆ పదవి వచ్చిందన్నారు. తనకు ఆ పదవి వచ్చినందుకు రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన ఆ పదవిని వద్దన్నారని చెప్పారు.

రానున్న ఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో 10-12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీవీ 'Uncensored' కు హాజరైన మహేశ్వర్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. తనకు, మంత్రి కోమటిరెడ్డికి ఇటీవల జరుగతున్న మాటల యుద్ధంపై అనేక విషయాలు పంచుకున్నారు. ఈ కింది వీడియోలో ఆయన ఫుల్ ఇంటర్వ్యూను చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు