Telangana: ప్రయాణికులకు అలర్ట్.. డిసెంబర్ 30న ఆటోల బంద్!

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్స్ యూనియన్ నేతలు. డిసెంబర్ 30న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటోలు బంద్ ఉంటాయని ప్రకటించారు.

New Update
Auto Drivers: ఆటో డ్రైవర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

Auto Union Bandh: తెలంగాణలో ఆటో డ్రైవర్లు నిరసన బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణంతో తమ పొట్ట కొట్టిందంటూ ఆటోల బంద్‌కు పిలుపునిచ్చారు ఆటో డ్రైవర్స్ యూనియన్. డిసెంబర్ 30వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్లు వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్‌ జేఏసీ చైర్మన్‌ ఎండీ అంకుషావలి, ఉమ్మడి జిల్లా జేఏసీ గౌరవ అధ్యక్షుడు చిర్ర రమేశ్‌గౌడ్‌ ప్రకటించారు. హనుమకొండ పబ్లిక్‌గార్డెన్‌లో నిర్వహించిన వరంగల్‌ ఉమ్మడి జిల్లా ఆటోడ్రైవర్స్‌ జేఏసీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని, ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఆటోల్‌ బంద్‌ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఆటోడ్రైవర్స్‌ ఉమ్మడి జిల్లా జేఏసీ కన్వీనర్లు దేవర మల్లేశ్‌, పిట్ట ప్రకాశ్‌, మామిడాల వెంకన్న, కోశాధికారి బండి లింగయ్య, ఉపకోశాధికారి ఓరుగంటి సదానందం, వైస్‌చైర్మన్లు పసుల యాదగిరి, జక్కుల భిక్షపతి, కస్తూరి రవి, మట్టెడ ఎల్లయ్య, మేకల ప్రభాకర్‌, కోకన్వీనర్లు ఎన్‌.నవీన్‌, జన్ను సదానందం, మట్టెడ నగేశ్‌, లక్ష్మయ్య పాల్గొన్నారు.

Also Read:

వైసీపీ మరో బిగ్ షాక్.. ‘గుడ్ బై’ చెప్పిన ఎమ్మెల్యే..!

ఆ ప్రచారంపై కేటీఆర్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్..

Advertisment
Advertisment
తాజా కథనాలు