Telangana: ఎంతటి వారైనా బొక్కలేస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్ ఉగ్రరూపం.. తెలంగాణ అసెంబ్లీలో చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా సాగింది. ముఖ్యంగా డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 16 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల వైఫల్యాలను సభలో ప్రస్తావించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో అన్నీ అవకతవకలే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్‌లో ఎక్కడ బడితే అక్కడ దొరికాయని అన్నారు. కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేకపోయిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. పదవ తరగతి పరీక్షలు మొదలు.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ వరకు ప్రశ్న పత్రాలను లీక్ చేశారంటూ ధ్వజమెత్తారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా నియమించలేదని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్, లిక్కర్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా డ్రగ్స్ వాడకం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను కూకటివేళ్లతో పెకిలించేస్తామని, ఈ వ్యవహారంలో ఎంతటి వారైనా బొక్కలేస్తాం అని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్‌ను నాశనం చేసే డ్రగ్స్ మహమ్మారి విషయంలో విపక్షం సైతం సహకరించాల్సిందిగా కోరారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ నిర్మూలనకు టీఎస్ న్యాబ్‌ను ఏర్పాటు చేశామని, ఆ డిపార్ట్‌మెంట్‌కి పూర్తి స్థాయిలో సహకరిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ తీరుపై ఆగ్రహం.. బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికసార్లు అవకాశం ఇచ్చినా.. అంశాలపై కాకుండా అక్కసు వెళ్లగక్కేందుకు సమయాన్ని వినియోగించుకుంటున్నారని ఫైర్ అయ్యారు సీఎం. చరిత్రను తవ్వితే తట్టుకోవడం మీవల్ల కాదంటూ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రంలా ఉందని కడియం శ్రీహరి అంటే.. బరాబర్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పదో తరగతి పరీక్షలే సరిగ్గా నిర్వహించలేని సర్కార్.. గత ప్రభుత్వం కనీసం పదో తరగతి పరీక్షలే సక్రమంగా నిర్వహించలేకపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్ష పత్రాలు జీరాక్స్ సెంటర్లో ఎక్కడ పడితే అక్కడ దొరికాయన్నారు. వారే ప్రశ్న పత్రాలు అమ్మకునున్నారు.. వారే గుర్తించారు.. వారే పట్టుకున్నారు.. కానీ బలైంది మాత్రం నిరుద్యోగులు అని అన్నారు రేవంత్. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల 30 లక్షల మంది నిరుద్యుగులు నష్టపోయారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులను మోసం చేసిన బోర్డు సభ్యులపై చర్యలను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు సీఎం. వాటాల్లో తేడాల వల్లే టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారం బయటకొచ్చిందన్నారు. ఈ విషయంలో నిరుద్యోగులకు బీఆర్ఎస్ ఇచ్చే సమాధానం ఏంటి? అని ప్రశ్నించారు సీఎం రేవంత్. గత ప్రభుత్వ హాయంలో స్కూల్ ఎడ్యూకేషన్‌లో తెలంగాణ రాష్ట్రం చివరి స్థానంలో ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమం.. ఇదే సమయంలో సభలో ఇందిరమ్మ రాజ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు అసైన్డ్ భూముల కేటాయింపు.. ఇందిరమ్మ రాజ్యం అంటే మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు.. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఇందిరమ్మ రాజ్యం అంటే రూ. 500 లకే గ్యాస్ సిలిండర్.. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ.. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇళ్లు.. అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. Also Read: వైరల్ అవుతున్న వీడియో.. క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి.. కొత్త రేషన్‌కార్డులు వచ్చేస్తున్నాయ్.. రూల్స్ ఇవేనా?! #telangana #cm-revanth-reddy #telangana-assembly #telangana-assembly-session మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి