Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్.. ప్రకటించిన కాంగ్రెస్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్.

New Update
Telangana: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్.. ప్రకటించిన కాంగ్రెస్

Gaddam Prasad Kumar: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ ఎ.చంద్రశేఖర్‌ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. 2014, 2018 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు ప్రసాద్ కుమార్. 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వికారాబాద్ నుంచి మరోసారి గెలుపొందారు. దీంతో ప్రసాద్ కుమార్‌ను స్పీకర్ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్.

publive-image

Also Read:

తెలంగాణకు వర్షసూచన..నేడు కూడా వానలు కురిసే ఛాన్స్!

రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం..

Advertisment
తాజా కథనాలు