Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) మృతికి సంతాపంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తీర్మానం ప్రవేశపెట్టారు. లాస్య నందిత మృతిపై కేటీఆర్ (KTR), మంత్రులు, బీజేపీ (BJP) నేతలు సంతాపం ప్రకటించారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు. తరువాత బీఏసీ సమావేశం ముగిసింది.
ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Meetings) జరగనున్నాయి. 8 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. రేపు అసెంబ్లీలో రైతు రుణమాఫీపై చర్చ జరగనుంది. ఎల్లుండి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కాగా ఈరోజు జరిగిన అసెంబ్లీ సమావేశానికి ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. దీంతో మరోసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా కొట్టనున్నారా? లేదా? అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.
Also Read : జాన్వీ గురించి అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన హీరో గుల్షన్..!