ఎన్నికలు దగ్గరపడుతుండడంతో కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే 12 రాష్ట్రాల ఇన్ ఛార్జ్ లను మారుస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ కూడా ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ గా దీపాదాస్ మున్షిని నియమించింది అధిష్టానం. ఇంతకు ముందు ఈ స్థానంలో మాణిక్ రావు ఠాక్రే ఉండేవారు. ఈయన స్థానంలో మున్షీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో మున్షీ పరిశీలకురాలిగా పని చేశారు. అలాగే కేరళ,లక్షద్వీప్‌లో కూడా దీప్ దాస్‌మున్షికి పార్టీ పూర్తిస్థాయి బాధ్యతలను అప్పగించింది. ఠాక్రేకు గోవా, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలి ఇన్‌ఛార్జ్ గా బాధ్యతలు ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాగూర్ ను నియమించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ బాధ్యతల నుంచి ప్రియాంకాగాంధీని తప్పించారు. ఆమెకు ఎలాంటి బాధ్యతలను ఇవ్వలేదు. ప్రియాంక స్థానంలో అవినాశ్ పాండేను నియమించింది ఏఐసీసీ.