Telangana ACB: ఏసీబీకి చిక్కిన జాయింట్‌ కలెక్టర్‌.. ఎలా పట్టుకున్నారంటే?

రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి ఆయన రూ.8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో వారు స్కెచ్ వేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

Telangana ACB: ఏసీబీకి చిక్కిన జాయింట్‌ కలెక్టర్‌.. ఎలా పట్టుకున్నారంటే?
New Update

Ranga Reddy Joint Collector: రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్ భూపాల్‌ రెడ్డి అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఆయనతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి కూడా ఏసీబీ (ACB) అధికారులకు చిక్కారు. ధరణి పోర్టల్ లో నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించడానికి భూపాల్ రెడ్డి ఎనిమిది లక్షల రూపాయలను బాధితుడి వద్ద లంచం డిమాండ్ చేశారు.

అయితే లంచం మొత్తాన్ని తన సీనియర్ అసిస్టెట్ మదన్ మోహన్ రెడ్డికి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ బాధితుడికి చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు నాగోల్ లోని జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇంట్లో పదహారు లక్షల రూపాయల నగదుతో పాటు కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: భయపడొద్దు.. మీకు నేనున్నా: గురుకుల స్టూడెంట్స్ కు భట్టి భరోసా!

#ranga-reddy #acb-raids #telangana-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe