Telangana Tenth Results : తెలంగాణ టెన్త్‌ రిజల్ట్స్‌ ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం!

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

New Update
NEET Results : నీట్‌ రీ ఎగ్జామ్ రిజల్ట్స్​ విడుదల​..!

TS Tenth Results 2024 : తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు(Telangana Inter Results) వెలువడిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల(10th Class Results) కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

తెలంగాణలో పది పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు 5,08,385 మంది హాజరయ్యారు. దీనికి సంబంధించిన వాల్యూయేషన్‌ గత శనివారం పూర్తయింది. ఇందుకోసం విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల సంఘం(Election Commission) అనుమతితో రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఇక మిగిలింది పదో తరగతి ఫలితాలు మాత్రమే. మరోవైపు ఎన్నికల కోడ్‌ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేస్తారు.

తెలంగాణ వ్యాప్తంగా మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఇందుకోసం విద్యాశాఖ మొత్తం 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి... ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు పరీక్షలు నిర్వహించారు. అయితే పరీక్షా కేంద్రాలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సైతం లోనికి అనుమతించారు.

రాష్ట్రంలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. 30,000ల మంది వరకు ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్‌లో కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Also read: కీరా తినేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

Advertisment
Advertisment
తాజా కథనాలు