Telangana :హైదరాబాద్ తో పాటు ముగ్గురు సీపీలు ఔట్.. లా అండ్ ఆర్డర్‌లో రేవంత్ మార్క్!

తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక లా అండ్ ఆర్డర్‌లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీపీలను మార్చేస్తూ CM రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సైబరాబాద్ సీపీగా అవినాష్‌ మహంతి,రాచకొండ సీపీగా సుధీర్‌బాబులను నియమించారు.

New Update
Telangana :హైదరాబాద్ తో పాటు ముగ్గురు సీపీలు ఔట్.. లా అండ్ ఆర్డర్‌లో రేవంత్ మార్క్!

Massive Changes In TS Police Department : తెలంగాణ(Telangana) లో కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ...రేవంత్(Revanth) సీఎం పదవి చేపట్టిన దగ్గర నుంచి పోలీసు శాఖలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి అన్న ఊహాగానాలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే  లా అండ్ ఆర్డర్‌లో భారీగా మార్పులు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.  ప్రస్తుతం హైదరాబాద్ ముగ్గురు సీపీలను ఒకేసారి మార్చేస్తూ సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(Kothakota Srinivas Reddy), సైబరాబాద్ సీపీగా అవినాష్‌ మహంతి,రాచకొండ సీపీగా సుధీర్‌బాబులను నియమించారు. ఇక యాంటీ నార్కోటిక్ వింగ్ డైరెక్టర్ గా సందీప్ శాండిల్యను అపాయింట్ చేశారు. ఇప్పటి వరకు పని చేసిన చౌహాన్, స్టీఫెన్ రవీంద్రలను డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆర్డర్ పాస్ చేశారు. మరోవైపు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని తీసుకొచ్చారు సీఎం రేవంత్.

publive-image

Also read:గాజువాక, మంగళగిరిలో బీసీ ఇన్‌ఛార్జ్ లను నియమించిన వైసీపీ

సీఎం రేవంత్ కొత్త ప్రభుత్వంలో తన టీమ్ ను తయారు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా కొత్త CSO, CPROలను నియమించారు. సీఎం CSOగా గుమ్మి చక్రవర్తి,  CPROగా అయోధ్యరెడ్డి లను నియమించారు. ప్రస్తుతం చక్రవర్తి యాంటి నార్కొటిక్స్‌ బ్యూరోలో ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఇంటలిజెన్స్ చీఫ్, సీఎం కార్యాలయ బాధ్యతలను కొత్తవారికి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఇవాళ డీజీపీ అంజనీ కుమార్ మీద కూడా ఈసీ సస్పెన్షన్ ఎత్తి వేశారు. దీంతో ఇప్పుడు రేవంత్ ఆయనకు ఏ పదవిని ఇస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ లో మార్పులు అయిపోయాయి కాబట్టి ఇక తరువాత ముఖ్యమంత్రి జిల్లాల మీద దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల ఎస్పీలు, ఐపీఎస్ లను మార్చే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Advertisment
తాజా కథనాలు