తెలంగాణ ప్రభుత్వం (Ts government) దీపావళి (Deepavali) పండుగను సోమవారానికి (నవంబర్ 13) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సెలవు పై ఎన్నికల సంఘం మాత్రం షాకింగ్ న్యూస్ చెప్పింది.ఆదివారం మాత్రమే దీపావళి సెలవుగా ప్రకటిస్తూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సోమవారం నాడు సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
ఎందుకంటే..నవంబర్ 13 వ తేదీన వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణా తరగతులు ఉన్నాయని, ఒకవేళ సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు ఏవీ కూడా సక్రమంగా జరగవని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పండితులు దీపావళిని నవంబర్ 13న జరుపుకోవాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నాడే పండుగ సెలవులను మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also read: నేటి నుంచి మూతపడనున్న బొర్రా గుహలు..ఎందుకో తెలుసా!
నిజానికి దీపావళి సెలవును ముందు ప్రభుత్వం నవంబర్ 12నే జరుపుకోవాలని అనుకున్నప్పటికీ..ఐచ్చిక సెలవు నవంబర్ 13గా జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని సవరించి నవంబర్ 13 ని దీపావళికి సాధారణ సెలవుగా మార్చడం జరిగింది.
తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యా సంస్థలు , ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు వారాంతపు సెలవులు లభించాయి. ఈసారి దీపావళి సెలవులు నవంబర్ 11 వ తేదీ రెండో శనివారం , 12 ఆదివారం . దీపావళి సందర్భంగా నవంబర్ 13 న కూడా సెలవు ఇవ్వడంతో రాష్ట్రంలో మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి.
కానీ నవంబర్ 13న సెలవు దినం కాకుండా కేంద్రం ఎన్నికల సంఘం 12 నే సెలవుగా ప్రకటించడంతో విద్యార్థులు కొంచెం గందరగోళానికి గురౌతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సెలవును రద్దు చేయడంతో విద్యార్థులు సోమవారం నాడు స్కూళ్లకు వెళ్లాల్సిందే.
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లను సోమవారం పరిశీలించాల్సి ఉంది. ఈ క్రమంలో సెలవు ప్రకటిస్తే కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలుండడంతో ప్రభుత్వం కూడా ఎన్నికల షెడ్యూల్ ను ఒకరోజు ముందుకు మార్చాల్సి ఉంటుందని సీఈవో కార్యాలయం ప్రభుత్వానికి బదులిచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా సెలవు గురించి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.