Bihar: 2024లో జేడీయూ ఖతం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

నితీష్‌ కుమార్‌ బీజేపీతో జతకట్టడంతో.. బిహార్‌లో ఇప్పడే అసలైన ఆట మొదలైందని ఆర్జేడీ నేత తేదస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమర్ చేసిన పనికి బిహార్ ప్రజలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయారని.. 2024 ఎన్నికల్లో జేడీయూ పూర్తిగా పట్టుకోల్పుతుందంటూ వ్యాఖ్యానించారు.

New Update
Bihar: 2024లో జేడీయూ ఖతం.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

బిహార్‌లో మహాఘట్‌బంధన్ కూటమి నుంచి విడిపోయి నితీష్‌ కుమార్‌ రాజీనామ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఈసారి బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మహాఘట్‌బంధన్‌ కూటమిలో.. ఆర్జేడీ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ నితీష్‌ తీరుపై స్పందించారు. బీజేపీ-జేడీయూ కూటమి ఏర్పాటుపై తాను మాత్రమే బీజేపీకి శుభాకాంక్షలు చెప్పగలనని అన్నారు.

Also read: నితీష్ కుమార్‌ తీరుపై వినూత్నంగా నిరసన.. వీడియో వైరల్

అన్ని విధాలుగా సహకరించాం

జేడీయును బీజేపీలో కూటమిలో కలుపుకున్నందుకు కూడా కృతజ్ఞతలు అని చెప్పారు. బిహార్‌లో ఇప్పుడే అసలైన ఆట మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ అలసిపోయారన్నారు. ఇప్పటివరకు ఆయన ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ పాలనకు ఆర్జేడీ పార్టీ అన్ని విధాలుగా సహకరించిందని గుర్తుచేశారు. నితీష్‌ ఇప్పుడు తాను ఎలాంటి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేయనని... నితీష్ ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదంటూ ఎద్దేవా చేశారు.

బిహార్ ప్రజలు మా వెంటే

ఇక 2024లో జరిగే లోక్‌సభల ఎన్నికల్లో జేడీయూ పూర్తిగా పట్టుకోల్పవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. నితీష్ కుమర్ చేసిన పనికి బిహార్ ప్రజలు ఆయనపై నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. నితీష్ కుమార్ పార్టీ వాళ్లు ఏం చేసినా కూడా బిహార్ ప్రజలు మాత్రం తమ వెంటే ఉంటారని తేజస్వీ యాదవ్ స్పష్టం చేశారు.

Also Read: 9వ సారి సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

Advertisment
తాజా కథనాలు