Tejashwi Yadav: ఆరోపణలు ఆపి నన్ను అరెస్టు చేయండి.. తేజస్వీ యాదవ్‌ సవాల్!

నీట్‌-యూజీ పేపర్ లీకేజీలో నీతీశ్‌ సర్కార్‌ తనపై నిందలు వేయడాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఖండించారు. ఈ అంశంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలుంటే అరెస్టు చేసుకోవాలంటూ ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

New Update
Tejashwi Yadav: ఆరోపణలు ఆపి నన్ను అరెస్టు చేయండి.. తేజస్వీ యాదవ్‌ సవాల్!

Bihar: నీట్‌-యూజీ పేపర్ లీకేజీ (NEET)లో వ్యవహారంలో తనపై నిందలు వేస్తున్న నీతీశ్‌ (Nitish kumar) సర్కార్‌ కు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) సవాల్ విసిరారు. నీట్ అంశంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలుంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సూచించారు. ఆర్జేడీ 28వ వార్షికోత్సవం సందర్భంగా పట్నాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తేజస్వీ మాట్లాడుతూ.. ‘నీతీశ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాలను ప్రోత్సహిస్తోంది. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వంలో ఒక ఇంజిన్‌ అవినీతిని, మరో ఇంజిన్‌ నేరాలను ప్రమోట్‌ చేస్తుంది. పేపర్‌ లీకైనా, వంతెనలు కూలినా, హత్యలు జరిగినా రాష్ట్రంలో ప్రతి సమస్య తేజస్వీ వల్లేనంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఆధారాలుంటే ఆరోపణలు ఆపి నన్ను అరెస్టు చేసుకోవచ్చు' అన్నారు.

నీట్‌- యూజీ ప్రవేశపరీక్ష పేపర్‌ లీక్‌ వెనక తేజస్వీ యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందంటూ బిహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ ఇటీవల ఆరోపించడంపై ఆర్జేడీ కౌంటర్‌ ఇచ్చింది. బిహార్‌లోని సీనియర్‌ మంత్రులతో ఇతర కీలక అనుమానితులు ఉన్న ఫొటోలను విడుదల చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు