Tejas fighter jet: ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్!

భారత వైమానిక దళానికి చెందిన తేజాస్ ఫైటర్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఓ హాస్టల్ సమీపంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

New Update
Tejas fighter jet: ఇళ్లపై కూలిన తేజాస్ ఫైటర్ జెట్.. వీడియో వైరల్!

IAF : భారత వైమానిక దళానికి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) తేజస్ ఆపరేషన్ శిక్షణలో భాగంగా మంగళవారం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సమీపంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు.

శిక్షణ సమయంలో ప్రమాదం..
ఈ ఘటనపై భారత వైమానిక దళం అధికారులు స్పందిస్తూ.. ఈ రోజు జైసల్మేర్ వద్ద కార్యాచరణ శిక్షణ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ విమానం ప్రమాదానికి గురైంది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేశామని చెప్పారు.

IAF హాక్ ట్రైనర్..
గత నెలలోనూ పశ్చిమ బెంగాల్‌లో శిక్షణ సమయంలో IAF హాక్ ట్రైనర్ విమానం ప్రమాదానికి గురైంది. కలైకుండ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సమీపంలోని విమానం కూలిపోయింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. పైలట్లిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు.

Advertisment
తాజా కథనాలు