Hanu-Man: ఓటీటీలో హనుమాన్ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

రికార్డు వసూళ్లతో దూసుకెళ్తున్న హనుమాన్ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వైరలవుతుంది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. మార్చి రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.

New Update
Hanuman OTT: హనుమాన్ ఓటీటీ రిలీజ్ డేట్ అదే.. అందుకోసమే ఆరోజు!

Hanuman OTT: యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Director Prasanth Varma) కాంబినేషన్ లో విడుదలైన హనుమాన్ భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సూపర్ హీరో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దుమ్ము రేపుతోంది. పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ సాధించి 300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. సంక్రాంతి కానుకగా థియేటర్స్ లో సందడి చేసిన హనుమాన్ తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత మరో ఆసక్తికరమైన సినిమా రిలీజ్ కాకపోవడంతో హనుమాన్ జోరు మరింత పెరిగింది. ఇక ఇప్పుడు ప్రేక్షకులు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ లేటెస్ట్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

హనుమాన్ ఓటీటీ రిలీజ్

హనుమాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ జీ5 (Zee5) దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో హనుమాన్ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుంది. కానీ త్వరలో అయితే వచ్చే అయ్యే అవకాశం అయితే లేదు. రిలీజైన 60 రోజుల తర్వాత స్ట్రీమింగ్ ఉంటుందని సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. హనుమాన్ రిలీజ్ డేట్ ప్రకారం మార్చి రెండు లేదా మూడవ వారంలో స్ట్రీమింగ్ ప్లాన్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read:  పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

publive-image

ఇక హనుమాన్ (Hanuman Movie) జోరు తగ్గకముందే సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు ప్రశాంత్ వర్మ. ఇటీవలే సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ అయినట్లు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో జై హనుమాన్ మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో జై హనుమాన్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Also Read: Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు