/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/techno1-1-jpg.webp)
TECNO Spark 20C: స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పెరుగుతున్న పోటీ కారణంగా ఫోన్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. మరీ ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీలు తక్కువ బడ్జెట్లో ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ అయిన టెక్నో (TECHNO) భారత మార్కెట్లో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 20సీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేసింది. టెక్నో నుండి ఈ తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొన్ని రోజుల క్రితం ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో (Amazon) చేర్చింది.ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ రూ. 10వేల కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ ఫోన్ భారతదేశంలో 8జీబీ ర్యామ్ తో వస్తున్న అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్. ఇది కాకుండా, టెక్నో ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 15 సిరీస్ వంటి డైనమిక్ ఐలాండ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మాత్రమే కాదు, ఫోన్ వెనుక ప్యానెల్ ఐఫోన్ లాగా కనిపిస్తుంది.
ధర, ఆఫర్లు:
టెక్నో స్పార్క్ 20 సిస్మార్ట్ ఫోన్ను నాలుగు కలర్లలో లాంచ్ చేసింది. ఆల్పెంగ్లో గోల్డ్, గ్రావిటీ బ్లాక్, మిస్టరీ వైట్,మ్యాజిక్ స్కిన్ గ్రీన్ కలర్స్ లో అందుబాటులో ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్ 8జిబిర్యామ్ + 128జిబిలో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.8,999 ధరకు విడుదల చేసింది. దీని మొదటి సేల్ మార్చి 5 మధ్యాహ్నం 12 గంటలకు ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో నిర్వహిస్తుంది. మొదటి సేల్‌లో ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 లాంచ్ ఆఫర్ ఇవ్వబడుతోంది.అంతేకాదు కంపెనీ ఈ ఫోన్‌తో ఓటీటీ ప్లే ఏడాది పాటు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తోంది.
ఫీచర్స్:
టెక్నో స్పార్క్ 20సి ఫీచర్లు చూసినట్లయితే.. 6.6 అంగుళాల హెచ్డీప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 720 x 1,612 పిక్సెల్‌లు. ఈ ఫోన్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో డైనమిక్ ఐలాండ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మీడియా టెక్ హలియో G36 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్‌లో 8జీబీ ఫిజికల్, 8జీబీ వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఉంటుంది. ఫోన్ ఇంటర్నల్ మెమరీ 128 జీబీ వరకు ఉంటుంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 1టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ ఫోన్ 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీనితో 18వాట్స్ యూఎస్బీ టైప్ C వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ వెనుక భాగంలో 50మెగాపిక్సెల్ ప్రధాన, 2మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
Binod ka ghum bhi leja, uski not-so smarter choice bhi leja - #DontBeBinod.#MakeASmarterChoice with TECNO Spark 20C.
Starting at just ₹7,999* | Sale starts 5th March, 12PM on @amazonIN.
Get notified: https://t.co/kj9spKOYRC#TECNOSmartphones#TECNOSpark20Cpic.twitter.com/rPH7xacALn— TECNO Mobile India (@TecnoMobileInd) February 27, 2024
ఇది కూడా చదవండి: నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. ట్రిపుల్ సెంచరీ దాటిన కిలో చికెన్ ధర.!