/rtv/media/media_files/2025/11/01/wiko-x70-price-2025-11-01-18-16-21.jpg)
Wiko X70 price
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ Wiko తన కొత్త స్మార్ట్‌ఫోన్ Wiko X70ని చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో సాధారణంగా ఫ్లాగ్‌షిప్ మొబైల్లో కనిపించే అనేక ఫీచర్లు ఉన్నాయి. దీని అతిపెద్ద హైలైట్.. ‘బీడౌ శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్’. ఇది మొబైల్ నెట్‌వర్క్ లేకుండా పనిచేస్తుంది. అంటే మీకు సిగ్నల్ లేకపోయినా.. మీరు అత్యవసర పరిస్థితుల్లో కనెక్ట్ అయి ఉండవచ్చు. దీంతో పాటు Wiko X70 ఫోన్‌లో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం.. దీనికి కున్‌లున్ గ్లాస్ అందించారు.
Wiko X70 price
Huawei Central ప్రకారం.. చైనాలో Huawei ప్రకటించిన మోడల్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. అందులో 8GB + 256GB, 12GB + 256GB, 12GB + 512GB కాన్ఫిగరేషన్లు ఉన్నాయి. దీని ధర సుమారు రూ. 17,500 నుండి ప్రారంభమవుతుంది. Wiko X70 ఫోన్ బ్లాక్, వైట్, లైట్ గ్రీన్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.
ICYMI: Wiko has officially launched the Wiko X70 in China.
— Manila Shaker (@ManilaShaker) November 1, 2025
SEE: https://t.co/voMrepAq5Ypic.twitter.com/KHbewalxMI
Wiko X70 specs
Wiko X70 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Wiko X70 120Hz రిఫ్రెష్ రేట్, కున్లున్ గ్లాస్ ప్రొటెక్షన్‌తో 6.7-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. హువావే ఇంకా దాని చిప్‌సెట్ వివరాలను పంచుకోలేదు. ఈ ఫోన్ 12GB వరకు RAM + 512GB స్టోరేజ్‌తో అనేక వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
ఫోటోగ్రఫీ కోసం.. Wiko X70 ఫోన్‌లో 50MP వెనుక కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32MP ముందు కెమెరా అందించారు. ఇది 40W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,100mAh బ్యాటరీతో పనిచేస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP54 -రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంటుంది. Wiko X70 డ్యూయల్-సిమ్ సపోర్ట్, USB 2.0 పోర్ట్‌తో వస్తుంది. ఇది బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ.. శాటిలైట్ కనెక్టివిటీ వంటి హై-ఎండ్ ఫీచర్లు దీనిలో భాగం కావడం మరింత మందిని ఆకర్షిస్తుందని కంపెనీ భావిస్తోంది.
 Follow Us