/rtv/media/media_files/2026/03/06/weakest-passwords-2026-03-06-20-23-46.jpg)
Weakest Passwords: ప్రస్తుత డిజిటల్ యుగంలో మన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా.. క్షణాల్లో డబ్బులు పోవడం ఖాయం. అందువల్లనే మన బ్యాంక్ అకౌంట్స్ అన్నీ పాస్‌వర్డ్‌లతోనే ముడిపడి ఉంటాయి. అలాగే ఫోన్లు, ట్యాబ్‌లు వంటి పరికరాలన్నింటికీ పాస్‌వర్డ్‌లు సెట్ చేసి ఉంచుతాం. ఈ పాస్‌వర్డులు సున్నితమైన డేటాను దొంగిలించకుండా నిరోధించడానికి ఉపయోగపడతాయి.
అయితే చాలా మంది తమకు గుర్తుండాలనే ఉద్దేశంతో అత్యంత బలహీనమైన పాస్‌వర్డులు సెట్ చేసి చిక్కుల్లో పడుతున్నారు. దీనివల్ల సైబర్ కేటుగాళ్లకు పని ఈజీ అయిపోతుంది. అందువల్ల వ్యక్తిగత వివరాలకు సంబంధించి పెట్టే పాస్‌వర్డ్‌లు బలంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రపంచంలోని 200 బలహీనమైన పాస్‌వర్డ్‌ల లిస్ట్‌ను సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్డ్ పాస్ రిలీజ్ చేసింది. అందులో అత్యంత బలహీనమైన, ఎక్కువగా హ్యాక్ అయిన పాస్‌వర్డ్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యంత బలహీనమైన పాస్‌వర్డ్‌లు
వరల్డ్ వైడ్‌గా లక్షలాది మంది ఈ కింద ఇచ్చిన పాస్‌వర్డ్‌లనే ఉపయోగిస్తున్నట్లు నార్డ్ పాస్ వెల్లడించింది. అందులో
12345/123456: ఈ పాస్‌వర్డ్‌ను దశాబ్ద కాలంగా ప్రపంచంలోనే టాప్ మోస్ట్ బలహీనమైన పాస్‌వర్డ్‌గా గుర్తించబడింది. హ్యాకర్లు ఈ పాస్‌వర్డ్‌ను ఒక్క సెకనులోపు క్రాక్ చేసే ఛాన్స్ ఉంది.
12345678 / 123456789: పాస్‌వర్డ్‌లలో అంకెలను పెంచినంత మాత్రాన సేఫ్టీ పెరగదు. సీక్వెన్స్‌లో ఉండే ఏ నెంబర్లయినా ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు.
000000/ 111111: ఒకే నెంబర్‌ను వరుసగా యూజ్ చేయడం కూడా సైబర్ నేరగాళ్లు ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంది.
iloveyou: ఎమోషనల్‌కు సంబంధించిన పదాలు కూడా డిక్షనరీ అటాక్ ద్వారా ఈజీగా కనిపెట్టే ఛాన్స్ ఉంది.
password: పాస్‌వర్డ్ అని పెట్టుకునే వారు ఇప్పటికి ఎన్నో మిలియన్లలో ఉన్నారు.
admin: చాలా రౌటర్లు, సర్వర్లు డిఫాల్ట్ పాస్‌వర్డ్‌గా అడ్మిన్ అనే పాస్‌వర్డ్‌ను కలిగి ఉంటాయి. ఇది హ్యాకర్లకు సులభమైన లక్ష్యం అవుతుంది.
qwerty: చాలా మంది కీబోర్డుపై వరుసగా ఉండే అక్షరాలను తమ పాస్‌వర్డులుగా పెట్టుకుంటారు. ఇది కూడా అత్యంత ఈజీగా క్రాక్ చేసే పాస్‌వర్డ్‌గా గుర్తించబడింది.
కాగా హ్యాకర్లు కొన్ని సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను యూజ్ చేసి ఇలాంటి సులభమైన పాస్‌వర్డ్ లను హ్యాక్ చేస్తారు. అందులో ‘బ్రూక్ ఫోర్స్’ అనే ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్ టూల్స్ ఒకటి. ఇవి ఒక సెకనుకు వేల సంఖ్యలో పాస్‌వర్డ్‌లను హ్యాక్ చేయగలవు.
Follow Us