/rtv/media/media_files/2025/11/03/vivo-y19s-5g-2025-11-03-19-49-47.jpg)
Vivo Y19s 5G
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలలో ఒకటైన వివో భారతదేశంలో Vivo Y19s 5Gని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Vivo Y19s 5G.. 15 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 15తో నడుస్తుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను 2 టిబి వరకు విస్తరించవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఇది 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Vivo Y19s 5G Price
Vivo Y19s 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4 GB RAM + 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999, 4 GB + 128 GB వేరియంట్ ధర రూ. 11,999, 6 GB + 128 GB వేరియంట్ ధర రూ. 13,499గా కంపెనీ నిర్ణయించింది. Vivo Y19s 5G టైటానియం సిల్వర్, మెజెస్టిక్ గ్రీన్ కలర్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో Vivo వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో సేల్‌కు ఉంది.
Vivo Y19s 5G launched with 90Hz display, Dimensity 6300, and 6,000mAh batteryhttps://t.co/ANl4LSP4Dl#Vivo#VivoY19s5Gpic.twitter.com/kTFQDX82qq
— GIZMOCHINA (@gizmochina) November 2, 2025
Vivo Y19s 5G Specs
Vivo Y19s 5G స్మార్ట్‌ఫోన్ 1,600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.74-అంగుళాల LCD HD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. 90 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 700 నిట్‌ల గరిష్ట డిస్ప్లే ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. Vivo Y19s 5G ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ OS 15ని నడుపుతుంది. మైక్రో SD కార్డ్ ద్వారా స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్‌ను 2TB వరకు విస్తరించవచ్చు. 15 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
Vivo Y19s 5G.. డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌లో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 0.8-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం Vivo Y19s 5G స్మార్ట్‌ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
 Follow Us