Rinku Singh: సోదరికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన రింకూ సింగ్.. ఫీచర్స్ బుర్రపాడు

టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ తన సోదరి నేహాకు హీరో విడా వీఎక్స్2 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు. దీని ధర సుమారు రూ.1 లక్ష (ఎక్స్-షోరూమ్). ఈ స్కూటర్ దాదాపు 142 కి.మీ రేంజ్ ఇస్తుంది. ఛార్జ్ చేయడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పడుతుంది.

New Update
rinku singh gifted his sister

rinku singh gifted his sister

ఇటీవల 2025 ఆసియా కప్‌లో టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ ఒక ప్లేయర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అతడు ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాడు. ఆఖరిలో ఫోర్‌తో భారత్‌ను గెలిపించాడు. 2025 ఆసియా కప్ గెలిచి తిరిగి ఇంటికి చేరుకున్న రింకు సింగ్ తన సోదరి నేహా సింగ్ కు ఒక ప్రత్యేక బహుమతిని ఇచ్చాడు. ఆమెకు Hero Vida VX2 Electric Scooterను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఫోటోలను నేహా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దాని స్టైలిష్ డిజైన్, లుక్, బ్యాటరీ, లాంగ్ రేంజ్‌కు బాగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు Hero Vida VX2 Electric Scooter ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

Hero Vida VX2 Electric Scooter Specs

Hero Vida VX2 Electric Scooter స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. హీరో వీడా VX2 గో BaaS బ్యాటరీ సర్వీస్‌తో రూ.44,990 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో VX2 గో ధర బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ.99,490 (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ నిర్ణయించింది. అలాగే VX2 ప్లస్ BaaS బ్యాటరీ సర్వీస్‌తో రూ.57,990కి లభిస్తుంది. అదే సబ్‌స్క్రిప్షన్ లేకుండా రూ.109,990 (ఎక్స్-షోరూమ్) నుండి అందుబాటులో ఉంది. అయితే వివిధ రాష్ట్రాల బట్టి ఆన్-రోడ్ ధరలు మారే అవకాశం ఉంది.

VIDA VX2 Go బ్యాటరీ సామర్థ్యం 2.2 kWh కాగా, VX2 ప్లస్ బ్యాటరీ సామర్థ్యం 3.4 kWhగా ఉంది. కంపెనీ ప్రకారం.. దీనికి ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 142 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది. VIDA పోర్టబుల్ ఛార్జర్ ఉపయోగించి ఇంట్లోనే బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఛార్జ్ చేయడానికి దాదాపు 5 నుండి 6 గంటలు పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 kW మోటారుతో పనిచేస్తుంది. ఇది మృదువైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కి.మీ.కు చేరుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ నగర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. 

హీరో వీడా VX2 లో టచ్‌స్క్రీన్ TFT డిస్‌ప్లే, బ్లూటూత్,  వై-ఫై కనెక్టివిటీ, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్, రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్, OTA (ఓవర్-ది-ఎయిర్) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, LED లైటింగ్, ఎకో, రైడ్, స్పోర్ట్ అనే రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. VIDA VX2 ఆధునిక, ఏరోడైనమిక్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో LED హెడ్‌ల్యాంప్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, తగినంత స్టోరేజ్ ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు