New Smartphone: రెడ్‌మీ నుంచి మరో కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. ధర చాలా తక్కువ..!

రియల్‌మీ త్వరలో భారత మార్కెట్లో తన బడ్జెట్ 5G ఫోన్ Realme C85 5Gని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది భారత్‌లో లాంచ్‌కు సిద్ధమైంది. కంపెనీ తన C-సిరీస్ లైనప్‌ను దేశంలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

New Update
Realme C85 5G

Realme C85 5G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ రియల్‌మీ త్వరలో భారత మార్కెట్లో తన బడ్జెట్ 5G ఫోన్ Realme C85 5Gని విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంచ్ అయింది. ఇప్పుడు ఇది భారత్‌లో లాంచ్‌కు సిద్ధమైంది. కంపెనీ తన C-సిరీస్ లైనప్‌ను దేశంలో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఈ నెల చివర్లో లాంచ్ కానున్నట్లు కంపెనీ తెలిపింది. Realme C85 5G దాదాపు రియల్‌మీ 15x లాగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ భారతదేశంలో రెడ్‌మీ తన 15C లైనప్, నోట్ 15 సిరీస్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని సమాచారం. ఇప్పుడు Realme C85 5Gకి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme C85 5G launch

ఇటీవల వియత్నాంలో లాంచ్ అయిన Realme C85 5G ఈ నెల చివర్లో భారతదేశంలో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అక్టోబర్‌లో భారతదేశంలో రూ.9,999 ప్రారంభ ధరకు లాంచ్ అయిన Realme 15x 5G లాగానే ఉంటుంది. Realme 15x ఫోన్ 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 60W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇక Realme C85 5G.. 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 45W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. భారతదేశంలో త్వరలో రాబోయే ఈ ఫోన్ ధర ప్రస్తుతం ఉన్న Realme 15x 5G కంటే కొంచెం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

లాంచ్ కానున్న రెడ్‌మి 15C, రెడ్‌మి నోట్ 15 సిరీస్‌లు

Redmi 15C ఈ నెల చివర్లో భారత మార్కెట్‌లో లాంచ్ అవుతుందని సమాచారం. ఇది 4G లేదా 5G వెర్షన్‌లో వచ్చే అవకాశం ఉందని ఒక టిప్ స్టర్ తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. ఈ రెండు ఫోన్లూ ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. Redmi 15C 4G.. మీడియాటెక్ హెలియో G81 అల్ట్రా ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే Redmi 15C 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. Redmi Note 15 సిరీస్‌ను కూడా భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసినట్లు టిప్‌స్టర్ పేర్కొన్నాడు. ఈ సిరీస్‌లోని Redmi Note 15 Pro, Note 15 Pro+ ఫోన్లు ఆగస్టులో చైనా మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. ఇక భారత్‌లో లాంచ్ అయిన తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లు జనవరి నాటికి అమ్మకానికి రానున్నాయి.

Advertisment
తాజా కథనాలు