Tablet Offers: 8,000mAh బ్యాటరీ, 8GB RAM ట్యాబ్‌పై రూ.6వేల భారీ తగ్గింపు.. !

అమెజాన్ సేల్‌లో OnePlus Pad Go (8GB+128GB)పై భారీ ఆఫర్ ఉంది. దీని ధర రూ.19,999 ఉండగా ఇప్పుడు రూ.16,999కి తగ్గింది. అదనంగా రూ.1,000 కూపన్ డిస్కౌంట్, SBI క్రెడిట్ కార్డ్‌పై రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. ఆ తర్వాత రూ.13,999కి లభిస్తుంది.

New Update
OnePlus Pad Go Tablet Offer in Amazon Great Indian Festival sale 2025

OnePlus Pad Go Tablet Offer in Amazon Great Indian Festival sale 2025

Amazon Great Indian Festival సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్‌ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లపై భారీ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో OnePlus Pad Go టాబ్లెట్‌పై అదిరిపోయే తగ్గింపు లభిస్తోంది. దీనిని భారతదేశంలో అక్టోబర్ 2023న లాంచ్ చేశారు. ఈ టాబ్లెట్ మార్కెట్‌లోకి వచ్చి దాదాపు రెండు ఏళ్లు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు దీని ధర తగ్గలేదు. తాజాగా ఈ OnePlus Pad Go పై భారీ ఆఫర్‌ను అమెజాన్ ప్రకటించింది.

ఇది 11.35-అంగుళాల డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 2,408 x 1,720 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఈ టాబ్లెట్ MediaTek Helio G99 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8,000mAh బ్యాటరీ శక్తిని పొందుతుంది. ఇప్పుడు ఈ టాబ్లెట్ భారీ తగ్గింపును పొందుతోంది. దీనికి సంబంధించిన ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం. 

OnePlus Pad Go Price

OnePlus Pad Go ట్యాబ్ 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.19,999 కు అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు Amazon Great Indian Festival సేల్‌లో ఇది రూ.16,999కు లిస్ట్ అయింది. అంటే రూ.3,000 తగ్గింపు లభిస్తుందన్నమాట. ఇంకా రూ.1,000 అమెజాన్ డిస్కౌంట్ కూపన్ ఉంది. SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి పూర్తి స్వైప్‌తో దీన్ని కొనుగోలు చేసే కస్టమర్‌లకు అదనంగా రూ.2,000 తగ్గింపు లభిస్తుంది. వీటన్నింటి తర్వాత OnePlus Pad Go రూ.13,999కి లభిస్తుంది. ఈ టాబ్లెట్‌ను LTE మోడల్స్, ఇతర స్టోరేజ్ ఆప్షన్‌లలో కూడా కొనుగోలు చేయవచ్చు.

OnePlus Pad Go Specs

OnePlus Pad Go స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 11.35-అంగుళాల (2,408 x 1,720 పిక్సెల్స్) డిస్‌ప్లేను కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. OnePlus Pad Go ప్యానెల్ 400 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ప్రాసెసర్ MediaTek Helio G99 SoC, 8GB LPDDR4X RAM + 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. OnePlus Pad Go ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) మద్దతుతో 8-మెగాపిక్సెల్ వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. 

OnePlus Pad Go ముఖ్యంగా 8,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 33W SUPERVOOC ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. టాబ్లెట్‌లో ఓమ్నిబేరింగ్ సౌండ్ ఫీల్డ్‌తో క్వాడ్ స్పీకర్లు, ఆడియో కోసం డాల్బీ అట్మోస్‌తో వస్తాయి. కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, బ్లూటూత్ 5.2, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు