Jio Cheapest Recharge Plan: ఓరి బాబోయ్.. రూ.75లకే జియో బంపర్ రీఛార్జ్ ప్లాన్.. అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్

జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.75లకే 23రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, sms, డేటా, జియో టీవీ యాక్సెస్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. అలాగే రూ.91, రూ.125, రూ.152, రూ.186, రూ.223 రీఛార్జ్ ప్లాన్‌లున్నాయి.

New Update
Jio Cheapest Recharge Plans

Jio Cheapest Recharge Plans


ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలోనే రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.100లోపు ధరను కలిగి ఉన్న ఈ ప్లాన్‌లలో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, ఎస్‌ఎంఎస్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చు. ఫ్రీ జియో టీవీ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇప్పుడు అతి తక్కువ ధరలో అందుబాటలో ఉన్న స్పెషల్ ప్లాన్‌ల గురించి తెలుసుకుందాం. 

Jio Cheapest Recharge Plan

జియో రూ.75 రీఛార్జ్ ప్లాన్

జియో అతి తక్కువ ధరకే రూ.75 ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 23 రోజుల వ్యాలిడిటీని అందుకుంటారు. అలాగే మొత్తం 2.5జీబీ డేటా వస్తుంది. అందులో రోజుకు 0.1GB డేటాను వాడుకోవచ్చు. అదనంగా 200MB డేటాను పొందుతారు. ఇంకా అపరిమిత కాల్స్, 50 SMSలు లభిస్తాయి. వీటితో పాటు జియో టీవీకి యాక్సెస్ కూడా పొందొచ్చు.

జియో రూ.91 రీఛార్జ్ ప్లాన్

జియో రూ.91 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. మొత్తం 3జీబీ డేటా వస్తుంది. అందులో రోజుకు 0.1GB డేటాను వాడుకోవచ్చు. అదనంగా 200MB డేటా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో యూజర్స్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 50SMSలు పొందుతారు. వీటితో పాటు జియో టీవీకి యాక్సెస్ కూడా పొందొచ్చు.

జియో రూ.125 రీఛార్జ్ ప్లాన్

జియో రూ.125 రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులు 23 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. అలాగే రోజుకు 0.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, 300 SMSలు, జియో టీవీకి యాక్సెస్‌ను కూడా పొందొచ్చు.

జియో రూ.152 రీఛార్జ్ ప్లాన్

జియో రూ. 152 రీఛార్జ్ ప్లాన్ వినియోగదారులకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో రోజుకు 0.5GB డేటాతో పాటు అదనంగా 1జీబీ డేటా ఇస్తుంది. అంతేకాకుండా అపరిమిత కాలింగ్, 300 SMSలను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులకు జియో టీవీని యాక్సెస్ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

జియో రూ.186 రీఛార్జ్ ప్లాన్

జియో రూ. 186 రీఛార్జ్ ప్లాన్‌ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో వినియోగదారులు రోజుకు 1GB డేటాను పొందుతారు. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇది కూడా జియో టీవీ యాక్సెస్ అందిస్తుంది. 

జియో రూ.223 రీఛార్జ్ ప్లాన్ 

జియో రూ.223 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇందులో వినియోగదారులు మొత్తం 56జీబీ డేటాను పొందుతారు. అంటే రోజుకు 2జీబీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు, జియో టీవీ యాక్సెస్ కూడా లభిస్తుంది.

Advertisment
తాజా కథనాలు