/rtv/media/media_files/2025/06/19/iphone-update-2025-06-19-14-43-57.jpg)
ఐఫోన్ వాడే వారికి బిగ్ అప్‌డేట్.. ఐఫోన్‌లో యూట్యూబ్ యాప్ ఎవరైతే వాడుతున్నారో వారు వెంటనే యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసి మళ్లీ ఇన్ స్టాల్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. యాప్ పనితీరుపై కొంతమంది యూజర్లనుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సమస్యను పరిష్కరించి ఈ మేరకు గూగుల్ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. ఐఫోన్‌లో యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసినప్పుడు క్రాష్ అవ్వడం లేకపోతే ఫ్రీజ్ అవ్వడం వంటి సమస్యలు ఇటీవల కాలంలో బాగా రావడండతో గూగుల్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో గూగుల్ స్పందించి సమస్యను పరిష్కరించింది.
ఫోన్‌ను ఓసారి రీస్టార్
ముందుగా ఐఫోన్ యూజర్లు మాన్యువల్‌గా యాప్‌ను రీ ఇన్‌స్టాల్ చేసుకోవాలని గూగుల్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న యాప్‌ను డిలీట్ చేసి ఫోన్‌ను ఓసారి రీస్టార్ చేయాలంది. అనంతరం యాపిల్ స్టోర్‌లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్ యూట్యూబ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన క్రాష్ అవ్వడం, ఫ్రీజ్ అవ్వడం వంటి సమస్యలు భవిష్యత్‌లో తలెత్తబోవని స్పష్టం చేసింది. అయితే, యాడ్ బ్లాకర్, థర్డ్ పార్టీ యాప్‌లను ఉపయోగించే యూజర్లకు మాత్రమే ఈ యాప్ క్రాష్ అవ్వడం వంటి సమస్యలున్నాయని గూగుల్ వెల్లడించింది.