/rtv/media/media_files/2026/02/28/new-mobile-2026-02-28-18-27-49.png)
టెక్ కంపెనీ హువావే గ్లోబల్ మార్కెట్లలో Huawei Mate 80 Proను ఆవిష్కరించింది. 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్, 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,750mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు హువావే వాచ్ జిటి రన్నర్ 2, వాచ్ అల్టిమేట్ 2, మేట్‌ప్యాడ్ మినీ, ఫ్రీబడ్స్ ప్రో 5, బ్యాండ్ 11 సిరీస్‌లను కూడా పరిచయం చేసింది. కాగా కంపెనీ ఇంకా Huawei Mate 80 Pro ప్రపంచవ్యాప్తంగా ధరను ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంపిక చేసిన మార్కెట్లలో అమ్మకానికి వస్తుంది. ప్రాంతాల వారీగా ధన మారుతుంది. ఇది 16GB RAM, 512GB స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. అలాగే బ్లాక్, గ్రీన్, గోల్డ్ కలర్‌లలో లభిస్తుంది.
Huawei Mate 80 Pro Specifications
Huawei Mate 80 Pro మొబైల్ 6.75-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2832 × 1280 పిక్సెల్ రిజల్యూషన్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ఇది 120Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 1440Hz PWM డిమ్మింగ్, 1.07 బిలియన్ కలర్స్, 3000 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. కాగా ఇటీవల ఇది చైనాలో కిరిన్ 9030 ప్రో SoCతో విడుదలైంది. ఈ ఫోన్ 16GB RAM, 512GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరా విభాగంలో.. Huawei Mate 80 Proలో 50-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్, వేరియబుల్ ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నాయి. ఇది 40-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48-మెగాపిక్సెల్ మాక్రో టెలిఫోటో లెన్స్, 100x డిజిటల్ జూమ్ వరకు ఉంటుంది. హ్యాండ్‌సెట్ ఆటోఫోకస్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 4K వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి.
Follow Us