అమెజాన్‌లో రూ.1.86లక్షల ఫోన్ బుక్ చేస్తే.. ఏం డెలివరీ అయిందో తెలిస్తే షాక్!

బెంగళూరులో జరిగిన ఒక డెలివరీ ఫ్రాడ్ షాకింగ్‌కు గురి చేస్తోంది. యలచెనహళ్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమారు రూ.1.86 లక్షలు విలువైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేయగా, ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో ఫోన్‌కు బదులు ఒక టైల్ (పెంకు) ముక్క వచ్చింది. 

New Update
Amazon delivery scam

ఆన్‌లైన్ డెలివరీ స్కామ్‌లో ఓ వ్యక్తి రూ.1.86లక్షలు పోగొట్టుకున్నాడు. బెంగళూరులో జరిగిన ఒక డెలివరీ ప్రాడ్ షాకింగ్‌కు గురి చేస్తోంది. యలచెనహళ్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సుమారు రూ.1.86 లక్షలు విలువైన ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను ఆర్డర్ చేయగా, ఆ పార్సిల్‌ను తెరిచి చూస్తే అందులో ఫోన్‌కు బదులు ఒక టైల్ (పెంకు) ముక్క వచ్చింది. 

43 ఏళ్ల టెకీ ఇటీవల ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ద్వారా శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 మోడల్‌ను ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 14న రూ.1,86,000 చెల్లించి ఆన్‌లైన్‌లోనే ప్రీ-పెయిడ్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 19న అతనికి పార్సిల్ డెలివరీ అయ్యింది. ఇలాంటి ఖరీదైన వస్తువులు డెలివరీ అయినప్పుడు మోసాలు జరిగే అవకాశం ఉన్నందున, కస్టమర్ తెలివిగా డెలివరీ బాక్స్‌ను తెరుస్తున్నప్పుడు మొత్తం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశాడు. అయితే, బాక్స్‌ను తెరిచి, అందులోని ఫోన్ ఓపెన్ చేయగా... అందులో ఖరీదైన ఫోన్ ఉండాల్సిన చోట, ఒక తెల్లటి టైల్ ముక్క కనిపించింది. ఇది చూసిన వినియోగదారుడు షాక్ అయ్యాడు.

పోలీసులకు ఫిర్యాదు:
వెంటనే డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో, మోసపోయానని తెలుసుకున్న కస్టమర్ మొదట నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) లో ఫిర్యాదు చేశాడు. అనంతరం కుమార్ స్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు నమోదు చేశాడు. పోలీసులు ఐటీ చట్టంతో పాటు సెక్షన్ 318(4) (మోసం), 319 (వ్యక్తిగతంగా మోసం చేయడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రికార్డు చేసిన వీడియో ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, డెలివరీ ప్రక్రియలో ఎక్కడ మోసం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డెలివరీ సంస్థ, దాని అవుట్‌సోర్సింగ్ పార్ట్నర్, పార్సిల్ నిర్వహణలో పాల్గొన్న సిబ్బందిపై దృష్టి సారించారు. ఆన్‌లైన్ షాపింగ్‌లో జరుగుతున్న ఇలాంటి మోసాల పట్ల వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు, తప్పనిసరిగా అన్‌బాక్సింగ్ వీడియో రికార్డ్ చేయాలని సూచిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు