Cheapest Cars: రయ్ రయ్.. 5.44 లక్షలకే 7 సీట్ల కారు.. పెద్ద ఫ్యామిలీకి పండగే- మైలేజ్ ఎంతంటే?

మార్కెట్‌లో 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. అందులో మారుతి ఈకో ఒకటి. ఇది రూ.5.44 లక్షలకు అందుబాటులో ఉంది. లీటర్ పెట్రోల్‌కు 20కి.మీ మైలేజీ అందిస్తుంది. దీని తర్వాత రెనాల్ట్ ట్రైబర్ ఉంది. దీనిని రూ.6.09 లక్షలతో కొనుక్కోవచ్చు.

New Update
Renault Triber and Maruti Eeco offers

Renault Triber and Maruti Eeco offers

తక్కువ ధరలో అద్భుతమైన 7 సీట్ల కార్లు మార్కెట్‌లోకి రావడంతో చాలా మంది వాటిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద ఫ్యామిలీ 7సీటర్ కార్లపైనే ఫోకస్ పెడుతున్నారు. దీంతో వాటికి మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఇప్పుడంతా హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లను వదిలి చౌకైన 7 సీటర్ కార్ల వైపు పరుగులు పెడుతున్నారు. అందువల్లే ప్రముఖ కంపెనీలు సైతం ఈ సెగ్మెంట్ పై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ప్రస్తుతం అతి తక్కువ ధరలో లభించే 7 సీటర్ కార్లపై ఓ లుక్కేద్దాం.

ఇది కూడా చూడండి: వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!

మారుతి ఈకో

భారతదేశంలో చౌకైన 7 సీట్ల కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెద్దగా బడ్జెట్‌ లేని వారి కోసం మార్కెట్‌లోకి అందుబాటు ధరలో కార్లు వస్తున్నాయి. మీ బడ్జెట్ కూడా తక్కువగా ఉంటే.. మారుతి ఈకో మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇది 5, 7 సీట్లలో అందుబాటులో ఉంది. ఇది 81 PS పవర్, 104 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ 1.2L లీటర్ పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. పెట్రోల్ మోడలే కాకుండా CNG ఆప్షన్ కూడా ఇవ్వబడింది. 

ఇది కూడా చూడండి: ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?

పెట్రోల్ మోడ్‌లో ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 20 kmpl మైలేజీని అందిస్తుంది. అదే సమయంలో CNG మోడ్‌లో ఇది 27 km/kg మైలేజీని ఇస్తుంది. సేఫ్టీ కోసం మారుతి ఈకోలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన EBD, చైల్డ్ లాక్, స్లైడింగ్ డోర్లు, డ్రైవర్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో అందించారు. Eeco ధర రూ. 5.44 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 

ఇది కూడా చూడండి: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్‌ కు నెతన్యాహు హెచ్చరికలు!

రెనాల్ట్ ట్రైబర్

రెనాల్ట్ ట్రైబర్ 7 మందికి సభ్యులకు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇందులో 5+2 సీటింగ్ లేఅవుట్ ఉంది. అందులో పెద్దవారు 5గురు, చిన్న పిల్లలు ఇద్దరు సులభంగా కూర్చోవచ్చు. ఈ కారు 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది Apple Car Play, Android Autoకి కనెక్టింగ్‌కు మద్దతు ఇస్తుంది. 

ఇది కూడా చూడండి: చెన్నై మీద ఆర్సీబీ సూపర్ విక్టరీ..పాయింట్ల పట్టికలో టాప్

సేఫ్టీ కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ విషయానికొస్తే.. ట్రైబర్ 999సీసీ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 72 PS పవర్, 96 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ అండ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 20 km మైలేజ్ అందిస్తుంది. ఈ కారు ధర రూ.6.09 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

(cheapest cars | offers | car offers | latest-telugu-news | telugu-news)

Advertisment
తాజా కథనాలు