Cheapest Recharge Plans: చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. 330 రోజుల పాటు ఫ్రీ ఫ్రీ - బోలెడు ప్రయోజనాలు..!

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దివాళీ సందర్భంగా అదిరిపోయే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. రూ.1999లతో రీఛార్జ్ చేసుకుంటే 330 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. డైలీ 1.5జీబీ డేటా, రోజుకి 100SMSలు, అన్‌లిమిడెట్ కాల్స్ ప్రయోజనాలు పొందుతారు.

New Update
Cheapest Recharge Plan

Cheapest Recharge Plan

ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్లకు అధిక ధరలలో రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. నెల రోజుల వ్యాలిడిటీతో రీఛార్జ్ చేసుకోవాలంటే దాదాపు రూ.300లకు పైగానే డబ్బులు పెట్టాల్సిందే. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ తమ యూజర్లను ఆకట్టుకుంటోంది. తరచూ కొత్త కొత్త ప్లాన్‌లతో అట్రాక్ట్ చేస్తోంది. 

BSNL Cheapest Recharge Plans

ఇందులో భాగంగానే BSNL తాజాగా మరొక బిగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. దీపావళికి ముందే అతి తక్కువ ధరలో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చి సంచలనం సృష్టించింది. అదే సమయంలో కొత్త ప్లాన్‌తో ప్రైవేట్ టెలికాం కంపెనీలను ఆశ్చర్యపరిచింది. BSNL కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో BSNL వినియోగదారులు ఎక్కువ రోజుల వ్యాలిడిటీ పొందుతారు. అదే సమయంలో ప్రతి రోజు డేటా, ఫ్రీ SMS ప్రయోజనాలు కూడా పొందొచ్చు. అందువల్ల ప్రతి నెలా రీఛార్జ్ చేయడంలో ఇబ్బంది పడకూడదనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత.. ఏడాది పొడవునా మళ్లీ రీఛార్జ్ చేయడం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

BSNL దీపావళి పండుగకు ముందు రూ. 1999 రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దాదాపు 330 రోజుల చెల్లుబాటును కలిగి ఉంది. అంటే వినియోగదారులు 11 నెలల పాటు రీఛార్జ్ చేసుకోవడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్‌లో డేటాను కూడా పొందుతారు. ఇదే విషయాన్ని BSNL తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది. 

ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 1.5GB డేటా పొందుతారు. అంతేకాకుండా అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ప్రతిరోజూ 100 SMSలు ఫ్రీగా ఇస్తుంది. వీటితో పాటు అక్టోబర్ 15 లోపు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. కస్టమర్లు అదనంగా 2% తక్షణ డిస్కౌంట్ పొందుతారని కంపెనీ పేర్కొంది. అంటే ఈ ప్లాన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అందువల్ల ఈ పండుగ సీజన్‌లో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఒక సంవత్సరం పాటు రీఛార్జ్ చేసుకోవలసిన అవసరమే లేదు.

Advertisment
తాజా కథనాలు