/rtv/media/media_files/2025/10/05/bike-mileage-increase-2025-10-05-17-11-31.jpg)
Bike Mileage Increase
ప్రస్తుతం వాహనాల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో ఇంట్లో రెండు మూడు బైక్‌లు సర్వ సాధారణం అయిపోయింది. ప్రతి రోజూ టూవీలర్ కొనేవారి సంఖ్య ఎక్కువవుతోంది. అయితే బైక్ కొనడం వరకు ఓకే కానీ.. దానిని ఎలా వాడాలి?, మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియక చాలా మంది తమ బైక్‌ను షెడ్డుకు పంపిస్తున్నారు. అక్కడ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే కొన్ని టిప్స్.. మీ బైక్ రేంజ్‌నే మార్చేస్తుంది. కేవలం 5 చిట్కాలు పాటిస్తే మీ బైక్‌ను షెడ్డుకు తీసుకెళ్లకుండా మైలేజ్‌ను పెంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Bike Mileage Increase Tips
రెగ్యులర్ చెకింగ్
మీ వాహనం మైలేజ్ పెంచడానికి రెగ్యులర్ చెకింగ్ అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే పాత ఆయిల్ ఇంజిన్ పనితీరును తగ్గిస్తుంది. అందువల్ల ఇంజిన్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా మార్చాలి. అలాగే ఎయిర్ ఫిల్టర్‌ను క్లీన్‌గా ఉంచాలి. ఎందుకంటే మురికిగా ఉన్న ఫిల్టర్ ఇంజిన్.. ఎక్కువ పెట్రోల్ వినియోగిస్తుంది. అలాగే స్పార్క్ ప్లగ్‌లను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చెక్ చేయాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చాలి.
టైర్ ప్రెజర్
టైర్లపై ప్రెజర్ వల్ల కూడా మైలేజ్ దెబ్బతింటుంది. అందువల్ల బైక్ నడిపేముందు టైర్లలో గాలి సరిపడా ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి. గాలి తక్కువగా ఉన్న టైర్లు ఎక్కువ ఘర్షణను సృష్టిస్తాయి. అది కాస్త ఇంజిన్‌పై ప్రభావం చూపుతుంది. అప్పుడు ఇంజిన్ మరింత కష్టపడి పనిచేయడానికి ఎక్స్‌ట్రా పెట్రోల్‌ను యూజ్ చేసుకుంటుంది. అందువల్ల వారానికోసారి టైర్ ప్రెజర్‌ను చెక్ చేయాలి.
డ్రైవింగ్ టెక్నిక్
సరైన డ్రైవింగ్ టెక్నిక్ పాటిస్తే.. బైక్ మైలేజీని పెంచుకోవచ్చు. ఇలా చేయాలంటే ముందుగా తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి. సరైన సమయంలో గేర్లను మార్చాలి. లేదంటే మైలేజ్ తగ్గుతుంది. ఒకవేళ మీరు అధిక వేగంతో వెళ్లడం, తక్కువ వేగంతో ఒకేసారి అన్ని గేర్‌లను మార్చడం లేదా అధిక వేగంతో వెళ్లేటప్పుడు తక్కువ గేర్‌లను ఉపయోగిస్తే అది ఇంధన వినియోగాన్ని పెంచుతుంది.
వాహనం పై అధిక బరువు
మోటార్ సైకిల్ పై అధిక బరువును తీసుకెళ్లడం వల్ల ఇంజిన్ పై ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన మైలేజ్ తగ్గుతుంది. అందువల్ల తక్కువ బరువుతో మాత్రమే వాహనంపై ప్రయాణం చేయాలి.
పెట్రోల్ క్వాలిటీ
క్వాలిటీ గల పెట్రోల్‌నే వాడాలి. లేదంటే అది ఇంజిన్ పనితీరును తగ్గించి పెట్రోల్ వినియోగాన్ని పెంచుతుంది. దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి తరచూ బ్రాండెడ్ కంపెనీ బంక్‌లలో మాత్రమే పెట్రోల్ కొట్టించాలి.
ఈ టిప్స్ పాటించడం వల్ల మీ బైక్ మైలేజీని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు.