Best 110cc Scooty: చౌకైన 110cc స్కూటీలు.. 50కి.మీ మైలేజ్- ధర తక్కువ ఫీచర్లెక్కువ..!

భారతదేశంలో 110cc స్కూటీలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇవి తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన రైడింగ్, ఇంధన సామర్థ్యం కారణంగా బాగా ప్రజాదరణ పొందాయి. అందువల్ల భారత మార్కెట్‌లో అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే బెస్ట్ 110cc స్కూటీల గురించి తెలుసుకుందాం.

New Update
Best 110cc Scooty

Best 110cc Scooty

భారతదేశంలో 110cc స్కూటీలకు డిమాండ్ పెరిగిపోయింది. ఇవి తక్కువ ఖర్చు, సౌకర్యవంతమైన రైడింగ్, ఇంధన సామర్థ్యం కారణంగా బాగా ప్రజాదరణ పొందాయి. అందువల్ల భారత మార్కెట్‌లో అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే బెస్ట్ 110cc స్కూటీల గురించి తెలుసుకుందాం. 

TVS Zest 110cc 

TVS Zest 110 స్కూటీ అతి తక్కువ ధరలో లభిస్తుంది. దీనిని కేవలం రూ.67,400 (ఎక్స్ షోరూమ్) నుండి కొనుక్కోవచ్చు. ఇది రద్దీగా ఉండే నగర రోడ్లపై సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీని 109.7cc ఇంజిన్ 7.71 bhp, 8.8 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. లీటర్ పెట్రోల్‌కు TVS Zest 110 స్కూటీ 48 నుంచి 50 కిమీ మైలేజీ అందిస్తుంది. LED DRLలు (డేటైమ్ రన్నింగ్ లైట్లు), ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, డ్యూయల్-టోన్ సీట్లు, డ్రమ్ బ్రేక్‌లు ఫీచర్లు ఉన్నాయి.

Honda Dio 110cc 

Honda Dio 110cc స్కూటీ మరో సరసమైన ఎంపిక. ఇది రూ.69,096 నుండి ప్రారంభమవుతుంది. దీని 109.51cc ఇంజిన్ 7.76 bhp పవర్, 9 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లీటర్ పెట్రోల్‌కు ఇది 48 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో కాంబి బ్రేక్ సిస్టమ్ (CBS), డిజిటల్-అనలాగ్ స్పీడోమీటర్, స్మార్ట్ కీ సిస్టమ్, USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌ల్యాంప్‌ల ఫీచర్లతో వస్తుంది. 

Hero Pleasure Plus 110cc

Hero Pleasure Plus 110cc స్కూటీ కూడా సరసమైన ధర, మైలేజీలో బాగా ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.71,149 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. దీని 110.9cc, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన ఇంజిన్ 8.04 bhp పవర్, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటీ లీటరుకు 50 కి.మీ వరకు మైలేజీ అందిస్తుంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, i3S టెక్నాలజీ (ఇంటెలిజెంట్ ఇంజిన్ స్టాప్-స్టార్ట్), బ్లూటూత్ కనెక్టివిటీ (XTEC వేరియంట్‌లో), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ ఫీచర్లు ఉన్నాయి. 

Honda Activa 6G

అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటీలలో Honda Activa 6G ఒకటి. వీటి ధరలు రూ.74,619 నుండి ప్రారంభమవుతాయి. దీని 109.51cc ఇంజిన్ 7.68 bhp పవర్, 8.79 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 50 కిమీ మైలేజీ అందిస్తుంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, సర్దుబాటు చేయగల వెనుక సస్పెన్షన్, మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్, H-స్మార్ట్ కనెక్టివిటీ (అధిక వేరియంట్లలో) ఫీచర్లున్నాయి.

Advertisment
తాజా కథనాలు