Metro: మొరాయించిన హైదరాబాద్ మెట్రో.. లోపలే ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు!

హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్టేషన్ లో ఆగిన ట్రైన్ డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. తోపులాటలోనే మర్జెఎన్సీ డోర్ ఓపెన్ చేసి బయకు వచ్చారు. సాంకేతిక లోపం కారణమని లోకో పైలట్లు తెలిపారు. ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Metro: మొరాయించిన హైదరాబాద్ మెట్రో.. లోపలే ఉక్కిరి బిక్కిరైన ప్రయాణికులు!

Hyderabad Metro: హైదరాబాద్ లో భారీ వర్షం కారణంగా మెట్రో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం మియాపూర్‌- ఎల్బీనగర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలు కొన్ని నిమిషాలపాటు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతోనే రైళ్లను నిలిపివేసినట్టు లోకో పైలట్లు తెలిపారు. అయితే వర్షం కారణంగా మెట్రో స్టేషన్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోగా.. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇక దీనిపై పలువురు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఎల్ బి నగర్‌లోనూ సాంకేతిక సమస్యతో మెట్రో మొరాయించగా.. ఎగ్జిట్ మిషన్లు సిబ్బందితో ప్రయాణికుల గొడవ పడ్డారు. దీంతో తోపులాట జరిగింది. లోపల గాలి ఆడక ఉక్కిరి బిక్కిరయ్యారు. చివరకు మర్జెఎన్సీ డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులు బయకు వచ్చినట్లు తెలిపారు. 'ఇవాళ మెట్రో చాల ఘోరం. ట్రెయిన్ లు లేట్.. అమీర్ పేట్ అయితే ఒక జాతర మాదిరి' అంటూ ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ‘ధర్మం దే విజయం’… వైరలవుతున్న ‘హరిహరవీరమల్లు’ కొత్త పోస్టర్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు