Tech Tips: ఫోన్ పాడైపోయిందని సర్వీస్ సెంటర్‌లో ఇస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి..

స్మార్ట్ ఫోన్‌ పాడైపోతే సర్వీస్ సెంటర్‌లో ఇవ్వాల్సి వస్తుంది. అయితే, రిపేర్ కోసం స్మార్ట్‌ ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌లో ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. బ్యాంక్ యాప్స్ ఉంటే డిలీట్ చేయాలి. వ్యక్తిగత డేటాను వేరే డివైజ్‌లో సేవ్ చేసుకోవాలి. సోషల్ మీడియా అకౌంట్స్ లాగౌట్ అవ్వాలి.

New Update
Tech Tips: ఫోన్ పాడైపోయిందని సర్వీస్ సెంటర్‌లో ఇస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి..

Tech Tips: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యమైంది. ఇది మన నిత్యావసర వస్తువుగా మారింది. స్మార్ట్‌ఫోన్ కాల్స్ చేయడానికి ఉపయోగించే గాడ్జెట్ మాత్రమే కాదు, బ్యాంకింగ్ సర్వీస్ మొదలు.. అనేక అవసరాలకు దీనిని ఉపయోగించడం జరుగుతుంది. వ్యక్తిగత ఫోటోలు, బ్యాంకింగ్ వివరాలు, అనేక ఇతర వ్యక్తిగత డేటా స్మార్ట్‌ఫోన్‌లో ఉంటాయి. అయితే, స్మార్ట్ ఫోన్ ఏదో ఒక రోజు పాడైపోయే అవకాశం ఉంటుంది. పలితంగా సర్వీస్ సెంటర్‌లో ఫోన్ ఇవ్వాల్సి ఉంటుంది. రిపేర్ కోసం ఫోన్ ఇచ్చే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ ముఖ్యమైన అంశాలేంటో ఓసారి చూద్దాం..

బ్యాంకింగ్ యాప్స్: మీ మొబైల్‌లో ఏదైనా బ్యాంకింగ్ యాప్‌లు ఉంటే ముందుగా వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయాలి. అప్లికేషన్‌లను తొలగించే ముందు పాస్‌వర్డ్, వినియోగదారు పేరును వ్రాసి ఉంచడం మంచిది.
నోట్‌ప్యాడ్ రిమూవ్ చేయాలి: స్మార్ట్‌ఫోన్‌లో నోట్ ప్యాడ్ ఉంటుంది. చాలా మంది నోట్‌ప్యాడ్‌లో పాస్‌వర్డ్, వ్యక్తిగత వివరాలను నోట్ చేసుకుంటారు. అయితే, ఎవరికైనా ఫోన్ ఇచ్చేటపుడు నోట్‌ప్యాడ్‌ని క్లియర్ చేయడం మర్చిపోవద్దు.
లాగ్ అవుట్: ప్రస్తుతం సోషల్ మీడియాను ఉపయోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సోషల్ మీడియా ఖాతాలను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు అన్ని ఖాతాల నుండి లాగ్ అవుట్ చేసిన తర్వాత మాత్రమే ఫోన్‌ను సర్వీస్ సెంటర్‌లో ఇవ్వాలి.
జీమెయిల్: లాగ్ అవుట్ అయిన తర్వాతే ఫోన్ సర్వీస్ సెంటర్‌కి జీమెయిల్ అకౌంట్ ఇవ్వాలి. Gmail అకౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలలో గోప్యతను పాటించడం చాలా ముఖ్యం.
వ్యక్తిగత ఫోటోలు: ఫోన్ గ్యాలరీలో ఏవైనా వ్యక్తిగత ఫోటోలు ఉంటే, వాటిని తొలగించాలి. ఫోటోలు కావాలంటే.. వాటిని మెమరీ కార్డ్ లేదా పెన్ డ్రైవ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయండి.

Also Read:

ఆ పదవికి రాజీనామా చేయనున్న రేవంత్ రెడ్డి..!

హమ్మయ్య.. రికార్డ్ స్థాయిలో తగ్గిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు