Jio Offer: జియో చైర్మన్ ముఖేష్ అంబానీ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. 47వ వార్షికోత్సవం సందర్భంగా జియో ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ ను ప్రకటించారు. యూజర్లకు 100 GB క్లౌడ్ స్టోరేజీని ఉచితంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. మొబైల్ లోని ముఖ్యమైన డేటాను ఈ క్లౌడ్ స్టోరేజ్ లో భద్రపర్చుకోవచ్చు. ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్ ఇందులో స్టోర్ చేసుకునే వీలుంటుంది. అంతేకాదు ఇక పై వినియోగదారులకు మరిన్ని AI సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. AI టెక్నాలజీని అందరికీ చేరువ చేయాలన్నదే మా ఆకాంక్ష. అందుకే జియో AI క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకురావాలని భావించినట్లు తెలిపారు.
అలాగే జియో ఫైబర్ రిమోట్‌లో ఇకపై AI బటన్‌తో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీంతో పాటు రిలయన్స్ షేర్ హోల్డర్లకు కూడా శుభవార్తను అందించారు. రిలయెన్స్ షేర్లు ఉన్న వారికి 1:1 పద్ధతిలో బోనస్ షేర్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే వార్షికోత్సవం సందర్భంగా ముఖేష్ అంబానీ కంపెనీ బాధ్యతలను తన వారసులకు అప్పగించబోతున్నారు. ఈశాకు రిటైల్, అకాష్‌కు జియో, అనంత్‌కు న్యూ ఎనర్జీ బిజినెస్‌లు హ్యాండ్ ఓవర్ చేయనున్నట్లు తెలుస్తోంది. చైర్మన్‌గా మరో ఐదేళ్లపాటు ముకేష్ అంబానీనే కొనసాగనున్నారు.
Also Read: Petrol Rate: క్రూడాయిల్ ధర పెరిగినా . . పెట్రోల్, డీజిల్ స్థిరంగానే! - Rtvlive.com