ICC Rankings: రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్ లలో అగ్రస్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా ICC విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ టీమ్‌ఇండియా మొదటి స్థానంలోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-1 తేడాతో చిత్తు చేసిన యువ భారత్ నాలుగు అగ్రస్థానాలకు కైవసం చేసుకుని తిరుగులేకుండా దూసుకెళ్తుంది.
ప్రపంచ నంబర్ 1 జట్టు..
భారత్ టెస్టుల్లో 122 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను చేరుకుంది. ఆస్ట్రేలియా (117) రెండో స్థానంలో నిలవగా.. ఇంగ్లాండ్ (111) మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (101), దక్షిణాఫ్రికా (99) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. వన్డేల్లో భారత్ (121), ఆస్ట్రేలియా (118), దక్షిణాఫ్రికా (110), పాకిస్థాన్ (109), న్యూజిలాండ్ (102) టాప్ -5లో ఉన్నాయి. టీ20 ఫార్మాట్ లో భారత్ (266), ఇంగ్లాండ్ (256), ఆస్ట్రేలియా (255), న్యూజిలాండ్ (254), పాకిస్థాన్ (249) మొదటి 5 ర్యాంకులను దక్కించుకున్నాయి. ఇక సెప్టెంబరు 2023 నుంచి జనవరి 2024 వరకు ఇండియానే ప్రపంచ నంబర్ 1 టెస్ట్ జట్టుగా ఉంది.
ఇది కూడా చదవండి: TS : ఆంధ్రోళ్ల బూట్లు నాకి సీఎం అయ్యావు.. ఎవరు మగాడో తేల్చుకుందాం దా.. కేటీఆర్ సవాల్!
డబ్ల్యూటీసీ టైటిల్ మనదే..
ఇక డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్ ఇప్పటికే వెస్టిండీస్ తో 2, దక్షిణాఫ్రికాతో 2, ఇంగ్లాండ్ తో 5 సిరీస్‌లు ఆడింది. ఇంకా బంగ్లాదేశ్ తో 2, న్యూజిలాండ్ తో 3, ఆస్ట్రేలియాతో 5 సిరీస్‌లు ఆడాల్సివుంది. ఇక భారత్ ఇదే జోరు కొనసాగిస్తే 2025 జూన్‌లో లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కచ్చితంగా గెలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2021, 2023 ఫైనల్లో భారత్ వరుసగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన టీమ్ ఇండియా.. ఈ సారి డబ్ల్యూటీసీ టైటిల్ చేజిక్కించుకునేలా కనిపిస్తోందంటున్నారు.