2024-25లో భారత క్రికెట్ షెడ్యూల్ ఇదే..

టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత టమ్ ఇండియా కొన్ని రోజుల రెస్ట్ తీసుకోనుంది. కానీ ఆ తర్వాత మాత్రం వరుసగా మ్యాచ్‌లు ఆడనుంది. దీనికి సంబంధించి భారత జట్టు షెడ్యూల్‌ను బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఇవన్నీ కూడా స్వదేశంలోనే జరగనున్నాయి.

New Update
2024-25లో భారత క్రికెట్ షెడ్యూల్ ఇదే..

Team India Schedule: టీమ్ ఇండియా క్రికెట్ పురుషుల జట్టు స్వదేశంలో ఆడే మ్యాచ్‌ల వివరాలను ప్రకటించింది బీసీసీఐ. బంగ్ఆదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌తో భారత్ సీరీస్‌లు ఆడనుంది సెప్టెంబరులో భారత పర్యటనకు వస్తున్న బంగ్లాదేశ్ జట్టు..రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. దీని తరువాత మూడు టెస్టుల కోసం న్యూజిలాండ్ టీమ్‌ అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించనుంది. తరువాత వచ్చే ఏడాది 2025లో ఇంగ్లాండ్ టీమ్‌ ఇక్కడకు వస్తుంది. టీమ్‌ఇండియాతో ఐదు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.

బంగ్లాదేశ్‌ టూర్‌ షెడ్యూల్
సెప్టెంబరు 19 - 24ల మధ్య చెన్నైలో మొదటి టెస్ట్
సెప్టెంబరు 27 - అక్టోబర్ 1 ల మధ్య కాన్పూర్ లో రెండో టెస్ట్

టీ20ల సిరీస్‌..

మొదటి టీ20: అక్టోబర్ 6 (ధర్మశాల)
రెండో టీ20: అక్టోబర్‌ 9 (దిల్లీ)
మూడో టీ20: అక్టోబర్ 12 (హైదరాబాద్‌)

న్యూజిలాండ్ టూర్‌ వివరాలు..
మొదటి టెస్టు: అక్టోబర్ 16 - 20 (బెంగళూరు)
రెండో టెస్టు: అక్టోబరు 24 - 28 (పుణె)
మూడో టెస్టు: నవంబర్ 1 - 5 (ముంబయి)
ఇంగ్లాండ్ టూర్‌

ఐదు టీ20ల సిరీస్‌..

తొలి టీ20: 22 జనవరి 2025 (చెన్నై)
రెండో టీ20: 25 జనవరి 2025 (కోల్‌కతా)
మూడో టీ20: 28 జనవరి 2025 (రాజ్‌కోట్)
నాలుగో టీ20: 31 జనవరి 2025 (పుణె)
ఐదో టీ20: 2 ఫిబ్రవరి 2025 (ముంబయి)

3 వన్డేల సిరీస్..

తొలి వన్డే: 6 ఫిబ్రవరి 2025 (నాగ్‌పూర్)
రెండో వన్డే: 9 ఫిబ్రవరి 2025 (కటక్)
మూడో వన్డే: 12 ఫిబ్రవరి 2025 (అహ్మదాబాద్)

Also Read:Big Breaking: నీట్‌ పరీక్షలో అక్రమాలను సహించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

Advertisment
తాజా కథనాలు