TDP : టీడీపీ కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోటీకి దూరం

AP: విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఈ ఎన్నిక బరిలో ఉన్నారు.

New Update
TDP Parliamentary: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

Visakha MLC By Election : సీఎం చంద్రబాబు (Chandrababu) సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా (Visakha District) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నారు. వైసీపీ (YCP) కి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపు ఈజీ కానుంది.

ఈ ఉప ఎన్నికకు వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కాకుండా మరో స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఈరోజుతో నామినేషన్ల గడువు ముగుస్తుండడంతో సాయంత్రం వరకూ ఇంకా ఎంతమంది ఈ ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ వేస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా నామినేషన్స్ ఉపసంహరణ గడువు 16 వ తేదీ వరకూ ఉంది. బొత్స మినహా మిగతా వాళ్ళు ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి దాదాపు 530 ఓట్ల బలంతో ఉంది.

Also Read : మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంట్లో ఏసీబీ తనిఖీలు!

Advertisment
తాజా కథనాలు