MLA Adimulam: రాసలీలల బాగోతం.. ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెండ్! సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. By srinivas 05 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి MLA Koneti Adimulam: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. టీడీపీ మహిళా కార్యకర్తపై లైంగిక వేధింపుల ఇష్యూలో ఆదిమూలంను సస్పెండ్ చేసింది. అశ్లీల వీడియోల వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే ఆదిమూలంపై వేటు వేశారు. అంతేకాదు ఆదిమూలంను త్వరలోనే పార్టీకి, పదవికి రాజీనామా చేయించి పార్టీ నుంచి పూర్తిగా తొలగించేందుకు చంద్రబాబు యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో తీవ్ర చర్యలు తీసుకున్న చంద్రబాబు గారు.#AndhraPradesh pic.twitter.com/lj2MkM3sKg — Telugu Desam Party (@JaiTDP) September 5, 2024 తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే రాసలీలల బాగోతం బయటపడింది. ఒక మహిళా నాయకురాలితో ప్రైవేటు హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఈ వీడియోలను ఆ బాధిత మహిళ విడుదల చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల రాసలీలల బాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల రాసలీలల బాగోతం బట్టబయలు కాగా, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. కోరిక తీర్చాలంటూ.. తన కోరికలు తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే ఆదిమూలం బెదిరిస్తున్నాడని బాధిత మహిళా పేర్కొంది. టీడీపీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని బాధిత మహిళా సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డు చేసినట్లు వెల్లడించింది. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని.. ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేసినట్లు పేర్కొంది. రాత్రి పూట మెసేజ్‌లు చేసి వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడని తెలిపింది. ఎమ్మెల్యే చేసే ఇలాంటి పనులకు తిరుపతి భీమా ప్యారడైజ్ హోటలే అడ్డా అని ఆమె తెలిపింది. ఇలాంటి వాళ్లను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని సీఎం చంద్రబాబును బాధిత మహిళా నాయకురాలు డిమాండ్ చేసింది. #ap-cm-chandrababu #mla-adimulam #suspend-tdp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి