/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-16T214954.739-1.jpg)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ నూతన అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ నియామితులయ్యారు. ఇప్పటివరకు పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన అధ్యక్షునిగా పల్లా శ్రీనివాసరావు యాదవ్‌కు బాధ్యతలు అప్పగించారు. బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్.. గాజువాక ఎమ్మెల్యేగా ఏపీలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మాజీ మంత్రి అమర్‌నాథ్‌పై ఏకంగా 95,235 ఓట్లతో మెజార్టీతో గెలిచారు.