Chandrababu: తిక్కలోడి పాలనలో అంతా రివర్స్.. ప్రచారంలో చంద్రబాబు పంచ్ లు

ఉత్తరాంధ్రపై విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి పెత్తానం ఏంటని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందిస్తే తిక్కలోడి పాలనలో అంతా రివర్స్ అయ్యిందన్నారు. ఈ రోజు రాజాంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

New Update
Chandrababu: తిక్కలోడి పాలనలో అంతా రివర్స్.. ప్రచారంలో చంద్రబాబు పంచ్ లు

Chandrababu Fires On CM Jagan: రాష్ట్రంలో అభివృద్ధిని తిక్కలోడు రివర్స్ చేశాడని జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu). తాను అధికారంలో ఉండి ఉంటే.. ఇక్కడి నిరుద్యోగులకు స్థానికంగానే ఉద్యోగాలు లభించేవన్నారు. ఈ రోజు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. హైదరాబాద్ ను మించి ఏపీని అభివృద్ధి చేయాలన్న తన ప్రణాళికను వైసీపీ ప్రభుత్వం (YCP Government) దెబ్బతీసిందన్నారు.
ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ స్టాండ్ ఏంటి?: మంత్రి బొత్స

వైసీపీ నేతలు ఆస్తులను దోచుకున్నారన్నారు. తాను ఉత్తరాంధ్రకు పరిశ్రమలను తీసుకువస్తే.. వైసీపీ భూ దందాలను తీసుకువచ్చారన్నారు. ఈ ప్రాంతాన్ని డ్రగ్స్ కు రాజధానిగా చేశారన్నారు. విశాఖకు డ్రగ్స్ కు ప్రభుత్వానికి తెలియకుండానే వచ్చాయా? అని ప్రశ్నించారు. ఆస్తుల మీద తప్ప.. విశాఖ మీద చంద్రబాబుకు ఎలాంటి ప్రేమ లేదన్నారు. ఈ ప్రాంతాన్ని కొల్లగొట్టడమే జగన్ లక్ష్యమన్నారు. చంద్రబాబు ఫుల్ స్పీచ్ ను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు