Minister Lokesh: నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసిన మంత్రి!

AP: తన వాట్సాప్‌ను మెటా సమస్త బ్లాక్ చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ బ్లాక్ అయినట్లు చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి తనకు వాట్సప్‌లో మెసేజ్ చేయొద్దు అని కోరారు.

New Update
Minister Lokesh: నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్.. ప్రజలకు కీలక విజ్ఞప్తి చేసిన మంత్రి!

Minister Nara Lokesh WhatsApp Blocked: తన వాట్సాప్‌ను మెటా సమస్త బ్లాక్ చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి తన వాట్సప్ బ్లాక్ అయినట్లు చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి తనకు వాట్సప్ లో మెసేజ్ చేయొద్దు అని కోరారు. ఏదైనా సమస్య లీ లేదా సహాయం కొరకు తమ పర్సనల్ మెయిల్ ఐడి [email protected] కి పంపించాలని అన్నారు.

లోకేష్ ట్విట్టర్ (X)లో.. "ప్రజల నుంచి వరదలా వచ్చిన మెసేజ్‌లతో సాంకేతిక సమస్య తలెత్తి నా వాట్సప్ మెటా బ్లాక్ చేసింది. మీ సమస్యలు దయచేసి నాకు వాట్సప్ చేయొద్దు. మీ సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి నా పర్సనల్ మెయిల్ ఐడీ [email protected] పంపించండి. పాదయాత్రలో యువతకు నన్ను చేరువ చేసిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే నా మెయిల్ ఐడి [email protected] క్రియేట్ చేసుకున్నాను. మీ పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరిచి మెయిల్ చేయండి. మీకు సహాయం చేయడం, సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను" అంటూ రాసుకొచ్చారు.

నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం 16వ రోజుకు చేరింది. ఈరోజు నియోజకవర్గానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు