టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనకాపల్లికి చెందిన టీడీపీ నేత మలశాల భరత్ కుమార్, ఆయన తండ్రి విశాఖ డెయిరీ డైరెక్టర్ రమణారావు, ఆయన తల్లి మాజీ ఎంపీపీ ధనమ్మలు సీఎం క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరారు. వారికి సీఎం జగన్ మోహన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భరత్ కుమార్ తో పాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్), మలశాల కుమార్ రాజా (విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి)లు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.
మరోవైపు విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య వైసీపీ కండువా కప్పుకున్నారు. తాడే పల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తలే భద్రయ్యకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు తలే రాజేశ్ కూడా పార్టీలో చేరారు. తలే భద్రయ్య టీడీపీలో సీనియర్ నేతగా వున్నారు.
గతంలో పాలకొండ నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీ నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా కూడా ఆయన పని చేశారు. ఆరేండ్ల పాటు ఆయన ఏపీపీఎస్సీ సభ్యునిగా ఆయన పని చేశారు.
Also read: యాప్ పేరిట ఘరానా మోసం…. రూ. 15 కోట్లకు కుచ్చు టోపి పెట్టిన మోసగాళ్లు…!