AP: రేపల్లెలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి భారీ చేరికలు! రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పలువురు టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రేపల్లె వైసీపీ ఇంఛార్జిగా ఈవూరు గణేష్ ను నియమించారు. By srinivas 20 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Guntur: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం కార్యకర్తలు టీడీపీకి భారీ షాక్ ఇచ్చారు. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాల నుంచి చాలామంది టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా వైసీపీలోకి చేరారు. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వారందరినీ కండువాకప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. రేపల్లె ఇంఛార్జిగా ఈవూరు గణేష్.. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్లె వైసీపీ ఇంఛార్జి ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు పాల్గొన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆలోచన మేరకు గణేష్ ను రేపల్లె నియోజకవర్గానికి ఇంఛార్జిగా మోపిదేవి వెంకటరమణ నియమించారు. ప్రతీ పేదవాడికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేలు జరిగిందని, రాష్ట్రంలోని ప్రతీ పేదవాడని ఆర్ధికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలనేదే జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. అందుకే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని అంతా కోరుకుంటున్నట్లు తెలిపారు. రేపల్లెలో ప్రతీ ఒక్కరూ ఈవూరు గణేష్ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. 175 సాధించడమే లక్ష్యం.. అలాగే రాజ్యసభ సభ్యులు, విజయసాయిరెడ్డి ఈవూరు గణేష్ ను రేపల్లె ప్రజలంతా గెలిపించి మీకు సేవచేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ కోసం మోపిదేవి వెంకటరమణ చేసిన త్యాగం మరువలేనిదని, కేసులు పెట్టినా ధైర్యంగా నిలబడి పార్టీ కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మోపిదేవికి మరొక్కసారి రాజ్యసభ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. రేపల్లె నుంచి ఈవూరు గణేష్ ను గెలిపిస్తే అటు అసెంబ్లీలోనూ ఇటు పార్లమెంట్ లోనూ మీ సమస్యలు వినిపించే అవకాశం దక్కుతుందన్నారు. 175 కు 175 సీట్లు సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇది కూడా చదవండి : MLA RK: జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు! ఆయనకు అవకాశం ఇవ్వొద్దు.. ఇక టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్ కు మూడవసారి రేపల్లె నుంచి అవకాశం ఇవ్వొద్దని కోరుతున్నట్లు ప్రజలు చెప్పారన్నారు. అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండరని, సత్యప్రసాద్ హైదరాబాద్ లో కూర్చుని పేకాట ఆడుకుంటాడని విమర్శించారు. అలాంటి వ్యక్తిని కాకుండా నిత్యం మీతోనే ఉండే ఈవూరు గణేష్ ను గెలిపించుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి జగన్ అధికప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. వైసీపీ అలా చేయదు.. అణగారిన వర్గాలకు సరైన ప్రధాన్యం కల్పించాలనేదే జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు. రిజర్వేషన్ల శాతానికి మించి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. చంద్రబాబు లాగా మనం నటించడం లేదు. వాస్తవాలకు దగ్గరగానే మనం నడుచుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే సామాజిక సమతుల్యత పాటిస్తాం. రాబోయే రెండు మూడు రోజుల్లో టీడీపీ బీజేపీతో జతకట్టడానికి తహతహలాడుతుంది. పార్టీ పెట్టిన నాటి నుంచి ఒంటరిగానే పోటీ చేశాం. భవిష్యత్తులోనూ ఒంటరిగానే పోటీచేస్తాం. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడం కోసమే కొన్ని అంశాల్లో మనం మద్దతిచ్చాం. జగన్ మోహన్ రెడ్డిని బలోపేతం చేసి మరింత గొప్ప విజయాన్ని అందించాలని కోరుతున్నామని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తెలిపారు. #tdp-leaders #joined-ycp #repalle #guntur-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి