TDP Leader Nara Lokesh: మంగళగిరి కోర్టుకు నారా లోకేష్.. పాదయాత్రకి బ్రేక్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వసీపీ నేతలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగళూరు శాంతి ప్రసాద్ పై లోకేష్ గతంలో పరువు నష్టం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు. By E. Chinni 18 Aug 2023 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి TDP Leader Nara Lokesh attends Mangalagiri Court: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. శుక్రవారం మంగళగిరి మెజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. వసీపీ నేతలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి, సింగళూరు శాంతి ప్రసాద్ పై లోకేష్ గతంలో పరువు నష్టం కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం యువగళం పాదయాత్రకు లోకేష్ విరామం ఇచ్చారు. తిరిగి శనివారం సాయంత్రం 4 గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నారు. పోసాని కృష్ణ మురళి ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కంతేరులో నారా లోకేష్ 14 ఎకరాల భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై రియాక్ట్ అయిన లోకేష్.. తనకు కంతేరులో గుంట భూమి కూడా లేదని, తనపై నిరాదార ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని లాయర్ ద్వారా పోసానికి నోటీసులు పంపించారు లోకేష్. రెండు సార్లు లాయర్ ద్వారా నోటీసులు పంపించినా.. పోసాని స్పందించక పోవడంతో.. లోకేష్ తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించారంటూ, పోసానిపై చర్యలు తీసుకోవాలని కోర్టుని ఆశ్రయించారు. అలాగే సింగలూరు శాంతి ప్రసాద్ అనే వ్యక్తి కూడా నారా లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఓ చర్చా కార్యక్రమంలో సింగలూరు ప్రసాద్.. తనపై నిరాధార ఆరోపణలు చేసినట్టు లోకేష్ ఆరోపించారు. దీనిపైనా తన న్యాయవాది ద్వారా శాంతి ప్రసాద్ కు నోటీసులు పంపారు. ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం, క్షమాపణ చెప్పకపోవడంతో శాంతి ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలంటూ కోర్టుని ఆశ్రయించారు. ఇలా రెండు పరువు నస్టం కేసుల్లో వాంగ్మూలం ఇవ్వడానికి లోకేష్ మంగళగిరి కోర్టులో హాజరయ్యారు. దీంతో యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు లోకేష్. మళ్లీ రేపు తిరిగి పాదయాత్రను ప్రారంభించనున్నారు. కాలినడకన లోకేష్ విజయవాడకు చేరుకోనున్నారు. యువగళం పాదయాత్ర కోసం విజయవాడలో టీడీపీ నాయకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు లోకేష్ పాదయాత్రతో మరోసారి బెజవాడలో టీడీపీ నేతల మధ్య తగాదాలు మరోసారి బయట పడ్డాయి. లోకేష్ యువగళం పాదయాత్రకు స్వాగతం పలుకుతూ టీడీపీ నాయకులు కరిముల్లా, పడాల వాసులు రోడ్డున పడి ఒకరినొకరు కొట్టుకున్నారు. అలాగే కేశినేని బ్రదర్స్ మధ్య వార్.. ఇలా బెజవాడ రాజకీయం మరోసారి రచ్చెక్కింది. విజయవాడలో లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు, పర్యవేక్షణ బాధ్యతను అధిష్టానం కేశినేని చిన్నికి అప్పగించింది. అధిష్టానం నిర్ణయంతో ఎంపీ కేసిని నాని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో లోకేష్ పాదయాత్రకు కేశినేని నాని హాజరు కారని టాక్ వినిపిస్తుంది. కానీ లోకేష్ పాదయాత్రకు అందరినీ ఆహ్వానించారని కేశినేని చిన్ని వర్గం చెబుతున్నా.. కేశినేని నాని వర్గం మాత్రం మాకు ఆహ్వానం అందలేదని అంటున్నారు. దీంతో లోకేష్ పాదయాత్రపై టెన్షన్ వాతావరణం నెలకొంది. #andhra-pradesh #nara-lokesh #posani-krishna-murali #tdp-leader-nara-lokesh #mangalagiri-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి