/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-who-went-to-Mangalagiri-court.legal-battle-against-false-propaganda.jpg)
Sajjala - Lokesh :తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ(TDP) నేత నారా లోకేష్(Nara Lokesh). ఆయన ట్విట్టర్(X) లో...'భోగి మంటలు.. ప్రగతి కాంతులు.. కష్ట నష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఆనందాలు ప్రతి ఇంటా వెల్లివిరియాలి. ప్రజలందరికీ #bhogi పండగ శుభాకాంక్షలు.' అంటూ రాసుకొచ్చారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు. వైసీపీ(YCP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ డిమాండ్లను తీర్చాలని చేస్తున్న సమ్మెపై వైసీపీ వ్యవహరిస్తున్న శైలిపై మండిపడ్డారు.
భోగి మంటలు.. ప్రగతి కాంతులు.. కష్టనష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఆనందాలు ప్రతి ఇంటా వెల్లివిరియాలి. ప్రజలందరికీ #bhogi పండగ శుభాకాంక్షలు.
— Lokesh Nara (@naralokesh) January 14, 2024
Also Read : Sankranti : భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్..
ప్యాలెస్ బ్రోకర్ సజ్జల..
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీ(Anganwadi) లు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల(Sajjala) బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్ సర్కారును ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఒకవేళ అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించినా ఎవరూ భయపడాల్సిన పనిలేదని అన్నారు. మరో 3నెలల్లో టిడిపి-జనసేన(TDP-Janasena) నేతృత్వంలో రాబోయే ప్రజాప్రభుత్వం ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా వారిని తిరిగి ఉద్యోగాల్లో నియమిస్తుందని హామీ ఇస్తూ... అంగన్ వాడీల పోరాటానికి సంఘీభావం తెలియజేస్తున్నామని అన్నారు.
న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 33రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న అంగన్ వాడీలు తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ ప్యాలెస్ బ్రోకర్ సజ్జల బెదిరింపులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారమదం తలకెక్కి కండకావరంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న జగన్…
— Lokesh Nara (@naralokesh) January 13, 2024
Follow Us