తస్మాత్ జాగ్రత్త!.. పేర్ని నానికి కొల్లు రవీంద్ర హెచ్చరిక!

మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. విశాఖ బాధితులకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులను ఇచ్చారని.. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం విశాఖ బాధితులను ఆదుకోలేదని అని మండిపడ్డారు.

Kollu Ravindra: "శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుంది"
New Update

AP Politics: మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra). జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖ బాధితులకు ఆర్థిక సాయం చేయడంపై నిన్న(శనివారం) పేర్ని నాని విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చేసిన సాయం కంటే అతను వచ్చిన విమానం ఛార్జీలే ఎక్కువ అంటూ సెటైర్లు వేశారు. మాకి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు.

ALSO READ: ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్: కేటీఆర్‌

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. దొంగే దొంగ అన్నట్టు పేర్ని నాని తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లపై హైకోర్టులో కేసు నడుస్తోందని గుర్తు చేశారు. ఆ పిల్ ప్రకారం ఆర్డీఓ, డీటీకి షోకాజ్ నోటీసులు ఇస్తే కాళ్లు పట్టుకుని అపుకున్నారని అన్నారు. పేర్ని అధికార దాహనికి అధికారులు బలైపోతున్నారని మండిపడ్డారు.

పేర్ని నాని చేసిన తప్పులను అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. చర్యలు లేకపోవటంతోనే కోర్టుకు వెళ్ళమని పేర్కొన్నారు. అధికారులకు ఒక్కటే చెపుతున్నాం రాజ్యాంగ పరిధులు దాటి ప్రవర్తిస్తే మీరు ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో 30 బొట్లు పూర్తిగా, 19 పాక్షికంగా దెబ్బతిన్నాయని అన్నారు. మత్య్యకారులు రోడ్డెక్కితే కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించలేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ ఘటన పూర్తి భాద్యతే ప్రభుత్వనిదే అని అన్నారు.

విశాఖ బాధితులకు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులిచ్చారని స్పష్టం చేశారు. బాధితులకు టీడీపీ తరఫున లక్ష 50వేలు రూపాయలను స్వచ్ఛదంగా ఇస్తున్నామని అన్నారు. దీనిపై పేర్ని నాని సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడని.. కొండలను దోచుకుంటున్మ వేసీపీ ఒక్క పైసా అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. జగన్ మోహనరెడ్డి ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఇస్తున్నాడు.. సొంత సొమ్ము ఏమి ఇవ్వలేదు గుర్తుపెట్టుకో అంటూ నానిపై ఫైర్ అయ్యారు. ఇంకోసారి పవన్ కళ్యాణ్ మీద గాని తెలుగుదేశం మీద గాని పిచ్చివాగుడు వాగితే తగిన శాస్తి చేస్తాం అని పేర్ని నానిని హెచ్చరించారు.

ALSO READ: కాంగ్రెస్ అధికారంలోకొస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి.. రాహుల్ గాంధీ

#ap-news #telugu-latest-news #perni-nani #kollu-ravindra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి