Roja vs anitha: మంత్రి రోజా(Minister roja)పై టీడీపీ నేత అనిత(anitha) ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలకు కళ్ళు ఉన్నాయా అని ప్రశ్నించారు. కళ్ళ ముందు జరుగుతున్నది చూడలేకపోతున్నారని విమర్శించారు అనిత. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగువారు బయటకు వచ్చి మేమంతా బాబుకు అండగా ఉన్నాం అని చెబుతున్నారన్నారు అనిత. నిరసన చేస్తున్న స్థలానికి మీ ఎమ్మెల్యే ఎవరైనా పోలీసులు లేకుండా వెళ్లే దమ్ముందా అని ప్రశ్నించారు. బ్రాహ్మణి కోసం వైసీపీ నేతలు మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తుందని చురకలంటించారు. రాజకీయాలు మాట్లాడని బ్రాహ్మణి గారిని చూసి వణికిపోతున్నారని ఎద్దెవా చేశారు. ఆమె క్యాండిల్ పట్టుకొని నిరసన తెలియజేసినా చూడలేకపోతున్నారని కౌంటర్ వేశారు. ఆమె ఏనాడు రాజకీయాలు మాట్లాడలేదన్నారు అనిత.
ప్రజాస్వామ్యానికి హ్యాట్సఫ్:
రోజా లాంటి వాళ్ళు నారా బ్రాహ్మని కోసం మాట్లాడటం చూస్తుంటే ప్రజాస్వామ్యానికి హ్యాట్సఫ్ చెప్పాలనపిస్తుందన్నారు అనిత. నీలాంటి(రోజా) వారిని మంత్రి పదవిలో కూర్చోబెట్టడమేంటో అర్థంకావడంలేదన్నారు. ఇంటర్‌మీడియట్ ఫెయిల్ అయిన రోజా బ్రాహ్మణి కోసం మాట్లాడటం దారుణన్నారు. జగన్ జైలుకి వెళ్లిన వెంటనే ఆమె తల్లి, భార్య, చెల్లి చెంగులు తడిచేలా ఏడ్చారని.. బెయిల్ మీద ఉన్న జగన్ పక్కన ఉండి బాబు కోసం మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు అనిత. చంద్రబాబు తప్పు చెయ్యలేదన్న ధైర్యం భువనేశ్వరి, బ్రాహ్మణి కళ్ళల్లో కనిపించాయన్నారు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ వెయ్యలేదని.. కడిగిన ముత్యంలా వస్తారని చెప్పారు. ప్రపంచ మేధావుల్లో మా తాత ఒకడు అని దేవాన్ష్ చెప్పుకుంటాడని.. రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు. గూగుల్‌లో కూడా సమాధానం దొరకదని.. ఈ విషయం లండన్‌లో చదువుకున్న అమ్మాయిలని అడిగితే చెబుతారని తెలిపారు.
ప్రజలు పట్టించుకోవడంలేదు:
రోజా మీరు ఎంత తలకిందులుగా తపస్సు చేసినా జగన్ తీసిన గోతిలో కాప్పెడతారనంటూ ఎద్దెవా చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి జగన్ తన గొయ్యి తానే తీసుకున్నాడన్నారు అనిత. కొద్ది సమయం ఓపిక పడితే వచ్చేది మేమే.. లెక్క తెల్చేది మేమేనని మండిపడ్డారు. అటు చంద్రబాబు నాయుడు అరెస్టును ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవడం లేదని మంత్రి రోజా విమర్శించారు. టీడీపీ నేతలు బలవంతంగా నిరసనలు నిర్వహిస్తున్నారని, మద్దతు పొందేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని రోజా ఆరోపించారు. తన అవినీతిపై దృష్టి మరల్చేందుకు చంద్రబాబు తన కొడుకు లోకేశ్, నటుడు బాలకృష్ణ, కోడలు భువనేశ్వరి, పవన్ కల్యాణ్‌లను ఉపయోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు. చివరికి ఈ వ్యూహాలు కూడా ఫలించలేదని రోజా ప్రస్తావించారు. ఇంకా పవన్ కల్యాణ్ స్థాయికి మించి మాట్లాడితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. తన తండ్రి ఆశయాలను నెరవేర్చి పేదల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత రాజకీయాల్లో లేని పవన్‌కు లేదని ఆమె వాదించారు.