Kesineni Nani : ఏపీ లో ఎన్నికలు(Elections) సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల అధినేతలకు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఈ క్రమంలోనే గతం వారం టీడీపీకి(TDP) గుడ్ బై చెప్పిన కేశినేని నాని వైసీపీ(YCP) తీర్థం పుచ్చుకుంటున్నట్లు వార్తలు పుకార్లు చేస్తున్నాయి. అతి త్వరలోనే వైసీపీ లోకి నాని వచ్చేందుకు రంగం సిద్దమైనట్లు సమాచారం.
నాని వెంట మరికొందరు..
ఈ క్రమంలోనే నాని వెంట.. నాని అనుచరులు కూడా కొందరు వస్తున్నట్లు వారందరికీ కూడా వైసీపీలో అవకాశం కల్పించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే నాని టీడీపీ కి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. తిరిగి విజయవాడ(Vijayawada) నుంచే పోటీ చేయనున్నట్లు కూడా తెలిపారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది మాత్రం నాని ఇప్పటి వరకు తెలపలేదు.
షరతులు వర్తిస్తాయి..
తాజాగా వైసీపీలో చేరేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీ నేతలు కొందరితో కేశినేని నాని సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం. అయితే నాని వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నప్పటికీ కొన్ని షరతులు విధించినట్లు సమాచారం. తనతో పాటు పార్టీలోకి వస్తున్న మరికొందరు టీడీపీ నేతలకు కూడా ఆయన సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది.
5 అసెంబ్లీ స్థానాలను కూడా..
విజయవాడ పార్లమెంట్ సీటుతో పాటు ఆ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాలను కూడా కేశినేని(Kesineni Nani) అడుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే తన పదవికి రాజీనామా చేసిన కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత(Kesineni Swetha) కి కూడా విజయవాడ తూర్పు, పశ్చిమం నుంచి మాజీ ఎమ్మెల్యే బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువూరు నుంచి నల్లగట్లు స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకలకు కేశినేని నాని టికెట్టు అడిగినట్లుగా సమాచారం.
ఈ క్రమంలోనే ఎంపీ సీటుతో పాటు రెండు అసెంబ్లీ సీట్లు ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నాని సూచించిన ఐదు స్థానాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల్ని ప్రకటించేసింది. దీంతో ఏం జరుగుతుందని అనే దాని మీద సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతుంది.దీనికి కేశినాని షరతులు వైసీపీ ఒప్పుకుంటుందా లేక కేశినేని నానినే షరతులు పక్కనబెట్టి వైసీపీ కండువా కప్పుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.
Also read: లక్షద్వీప్ టూరిజానికి సంబంధించి కీలక ప్రకటన చేసిన టాటా గ్రూప్!